Sankranthi Movies : 2025 సంక్రాంతి అయిపోయింది.. 2026 సంక్రాంతి టార్గెట్.. ఈసారి చిరు – వెంకీ – నాగ్ పోరు..?
ఈ సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లో నడుస్తుండగానే నెక్స్ట్ సంక్రాంతికి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు.

after Completing This Sankranthi some Heros Targeting 2026 Sankranthi
Sankranthi Movies : ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోలు పోటీ పడతారని తెల్సిందే. సంక్రాంతి సినిమాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు. అభిమానులు కూడా తమ హీరోల సినిమాలు సంక్రాంతికి వస్తే బాగుండు అని అనుకుంటారు. నిర్మాతలు కూడా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తే టాక్ తో సంభందం లేకుండా కలెక్షన్స్ తెచ్చుకోవచ్చు అనుకుంటారు.
ఈ 2025 సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముగ్గురు హీరోల మధ్య మంచి పోటీనే నడిచింది. గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా డాకు మహారాజ సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం మొదటి ఆట నుంచి హిట్ టాక్ వినిపిస్తుంది.
Also See : Nayanthara Family : ఫ్యామిలీతో నయనతార సంక్రాంతి సెలెబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?
ఈ సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లో నడుస్తుండగానే నెక్స్ట్ సంక్రాంతికి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. సంక్రాంతి సినిమాలు ముందుగానే డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటాయని తెలిసిందే. 2026 సంక్రాంతికి ఇంకా ఏ సినిమా అధికారికంగా ప్రకటించకపోయినా ఇద్దరు హీరోలు మాత్రం పోటీ పడబోతున్నారని తెలుస్తుంది. 2026 సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ పోటీపడబోతున్నట్టు సమాచారం.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సమ్మర్ లేదా ఆగస్టు వరకు వస్తుందని తెలుస్తుంది. ఆ తర్వాత దసరా డైరెక్టర్ సినిమా ఉన్నా అనిల్ రావిపూడి సినిమా కూడా ఓకే చేసాడని తెలుస్తుంది. అనిల్ స్వయంగా చిరంజీవి గారితో కథ ఓకే అయింది. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకసారి ఫైనల్ అయిపోతే సినిమా మొదలయినట్టే అని ఇటీవల ప్రమోషన్స్ లో చెప్పాడు. మళ్ళీ పండక్కి సినిమా తీసుకొస్తాను అని సంక్రాంతికి వస్తున్నాం సినిమా చివర్లో చెప్పాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి నాలుగు నుంచి అయిదు నెలలు ఇస్తే చాలు సినిమా రెడీ చేసేస్తాడు. దీంతో టాలీవుడ్ టాక్ ప్రకారం 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా ఉండబోతుందని వినిపిస్తుంది.
Also Read : Manchu Manoj : మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
అలాగే వెంకటేష్ కూడా 2026 సంక్రాంతికి మళ్ళీ వస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ 2024 సంక్రాంతికి కూడా సైంధవ్ సినిమాతో వచ్చాడు. ఇటీవల ప్రమోషన్స్ లో వెంకటేష్.. తన చేతిలో ఏ సినిమా లేదు కానీ నాలుగు కథలపై వర్క్ చేస్తున్నారు. వాటిల్లో ఏది ముందు అయితే దాన్ని చేస్తాను అని చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్ బ్యానర్‌స్ సినిమాలు చేయాలి అని చెప్పారు వెంకటేష్. వెంకీమామ కోసం డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, అనుదీప్, విమల్ కృష్ణ కథలని రెడీ చేస్తున్నారు. వీరిలో ఎవరికి ముందు ఓకే చెప్తే ఆ సినిమా మొదలుపెట్టి ఈ ఇయర్ లో పూర్తిచేసి మళ్ళీ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
దీంతో అనధికారికంగా 2026 సంక్రాంతి బరిలో చిరంజీవి – వెంకటేష్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అసలే ఇంకో సంక్రాంతి హీరో నాగార్జున 2024లో నా సామిరంగ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఈ సంవత్సరం 2025లో సంక్రాంతి మిస్ అయింది కాబట్టి 2026 సంక్రాంతి బరిలో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఆ సమయానికి ఇంకే హీరో అయిన తమ సినిమాని బరిలో దింపుతారా చూడాలి.