Manchu Manoj : మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

నేడు సంక్రాంతి సందర్భంగా మంచు మనోజ్ సంక్రాంతి స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు.

Manchu Manoj : మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

Manchu Manoj Celebrates Sankranthi with Family and Mega Heros

Updated On : January 14, 2025 / 8:32 PM IST

Manchu Manoj : మంచు మనోజ్ గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ గొడవలతో వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని నెలల క్రితం వరకు కూడా సినిమాలకు దూరంగా ఉండి ఇటీవలే షోలు, సినిమాలతో కంబ్యాక్ ఇస్తున్నాడు. తాజాగా నేడు సంక్రాంతి సందర్భంగా మంచు మనోజ్ సంక్రాంతి స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు.

Also Read : Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార సంక్రాంతి స్పెషల్ ఫోటోలు చూశారా? ట్రెడిషినల్ గా..

మనోజ్ షేర్ చేసిన ఫోటోలలో మనోజ్, అతని భార్య, కొడుకు, కూతురుతో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సీనియర్ నటుడు నరేష్ తనయుడు విజయ్ కృష్ణ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మనోజ్, సాయిధరమ్ తేజ్, విజయ్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. దీంతో మనోజ్ ఈసారి సంక్రాంతి పండగను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Manchu Manoj Celebrates Sankranthi with Family and Mega Heros

మంచు మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకులకు కనిపించాడు. దీంతో మధ్యలో ఫ్యాన్స్, ప్రేక్షకులు మనోజ్ సినిమాలకు దూరమయ్యాడు అనుకున్నారు. కానీ గత సంవత్సరం ఉస్తాద్ అనే ఓటీటీ షో చేసాడు. త్వరలో వరుస సినిమాలతో రానున్నాడు. మనోజ్ చేతిలో ప్రస్తుతం మిరాయ్, భైరవం, వాట్ ది ఫిష్ సినిమాలు ఉన్నాయి.

Also See : Krithi Shetty : సంక్రాంతి నాడు సింపుల్ గా కృతిశెట్టి ఫోటోలు..