Chalapathi Rao : చలపతి రావు భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయినా..
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు మరణంతో సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చలపతి జీవితంలో మాత్రం ఒక విషాద సంఘటన ఉంది. చలపతి రావు భార్య పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో..

after his wife death Chalapathi Rao didn't go another marriage
Chalapathi Rao : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు మరణంతో సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. 56 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించారు చలపతి. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో అలరించిన చలపతి నిర్మాతగా కూడా టాలీవుడ్ లో సేవలు అందించారు. ఇక గత కొన్నిరోజులుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఈ నటుడు.. ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.
Chalapathi Rao : నందమూరి కుటుంబంతో చలపతికి ప్రత్యేక అనుబంధం..
కాగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చలపతి జీవితంలో మాత్రం ఒక విషాద సంఘటన ఉంది. చలపతి రావు భార్య పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో ఒకడు టాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు రవిబాబు అయితే మరో ఇద్దరు ఆడపిల్లలు. వారిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఈ ముగ్గురు జన్మించిన కొన్నేళ్ళకే చలపతి తన సతీమణిని కోలుపోయారు.
చెన్నైలో ఉన్న సమయంలో ఒక రోజు తెల్లవారుజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన చలపతి భార్య ఇందుమతి చీరకు నిప్పు అంటుకొని అనుకోని ప్రమాదంలో పడ్డారు. చలపతి వెంటనే మంటలార్పి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా, మూడురోజులు పాటు ఆమె మృత్యువుతో పోరాడి మరణించారు. పిల్లలు అందరూ చిన్న వయసులో ఉన్నారని రెండు పెళ్లి చేసుకోమని ఎంతమంది సలహా ఇచ్చినా.. చలపతి మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.