Naari Song : రీ ఎంట్రీలో మరో పాట పాడిన రమణ గోగుల.. ‘నారి’ సినిమా కోసం.. మీరు కూడా వినేయండి..
రీ ఎంట్రీలో రమణ గోగుల మరో సాంగ్ ని పాడారు.

After Sankranthiki Vasthunnam Ramana Gogula Sings Song for Naari Movie
Naari Song : ఒకప్పటి స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సాంగ్ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీ ఎంట్రీలో రమణ గోగుల మరో సాంగ్ ని పాడారు.
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘నారి’. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి.. లాంటి వుమెన్ ఎంపవర్మెంట్ కథాంశంతో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Aadi Pinishetty : సరైనోడు సినిమా చూసి మెగాస్టార్ కాల్ చేసారు.. ఎయిర్ పోర్ట్ లో ఉన్నాను.. మా నాన్న ఎమోషనల్..
ఇప్పటికే నారి సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయి మెప్పించాయి. తాజాగా నేడు శివరాత్రి సందర్భంగా రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే..’ సాంగ్ రిలీజయింది. వినోద్ కుమార్ విన్ను సంగీత దర్శకత్వంలో ప్రసాద్ సాన రాసిన లిరిక్స్ ని రమణ గోగుల అద్భుతంగా పాడారు. ఈ పాట కూడా ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..
శశి వంటిపల్లి నిర్మాణంలో తెరకెక్కిన నారి సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.