Aadi Pinishetty : సరైనోడు సినిమా చూసి మెగాస్టార్ కాల్ చేసారు.. ఎయిర్ పోర్ట్ లో ఉన్నాను.. మా నాన్న ఎమోషనల్..
ఆది పినిశెట్టి మొదటిసారి బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో విలన్ గా నటించాడు.

Megastar Chiranjeevi Calls to Aadi Pinishetty after Watching Sarrainodu Movie
Aadi Pinishetty : హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఆది పినిశెట్టి. ఇప్పుడు శబ్దం సినిమాతో రాబోతున్నాడు. గతంలో ఆదితో వైశాలి లాంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు అరివాజగన్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శబ్దం సినిమా ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
ఆది పినిశెట్టి మొదటిసారి బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమాకు విలన్ గా ఆదికి మంచి పేరొచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడాడు ఆది పినిశెట్టి.
Also Read : Nabha Natesh : శివరాత్రి స్పెషల్.. పండగపూట చీరలో ఎంత ముద్దుగా ఉందో నభా నటేష్.. ఫోటోలు వైరల్
ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. సరైనోడు నాకు చాలా స్పెషల్ ఫిలిం. బోయపాటి గారు ఆఫర్ ఇచ్చినప్పిడు నేను చేయగలనో లేదో అని ఆలోచించాను. సినిమా రిలీజయ్యాక స్టైలిష్ విలన్ అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ కి ముందు ఇండస్ట్రీలో పలువురికి షోలు వేశారు. దాంతో చిరంజీవి గారు సరైనోడు సినిమా చూసారు. నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసారు. అప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఉన్నాను. సిగ్నల్ లేదు అని ఎయిర్ పోర్ట్ లో సిగ్నల్ కోసం పరిగెత్తాను. ఓ పక్క ఫ్లైట్ టైం అయిపోతుంది. కానీ చిరంజీవి గారు కాల్ చేయడంతో అదేం పట్టించుకోలేదు. ఆయన సరైనోడు సినిమా చూసి బయటకు వచ్చి నాకు కాల్ చేసారు. బాగా చేసావు అని చెప్పారు. చిరంజీవి గారు ఆయనంతట ఆయన నాకు కాల్ చేసి నా యాక్టింగ్ ని మెచ్చుకోవడంతో నాకు కన్నీళ్లు వచ్చేసాయి. చిరంజీవి కాల్ చేసారని తెలిసి నాన్న గారు బాగా ఫీల్ అయి ఎమోషనల్ అయ్యారు. నాన్న చిరంజీవి కలిసి సినిమాలు చేయడంతో వాళ్ళ మధ్య మంచి బంధం ఉంది అని తెలిపారు.
Also Read : Aha OTT : ఆహా ఓటీటీ మరో సరికొత్త ప్రయోగం.. తమిళ్ లో.. ఇండియాలోనే మొదటిసారి ఇలా..
ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. చిరంజీవితో జ్వాలా, చక్రవర్తి, యముడికి మొగుడు, ప్రతిబంద్, ఆజ్ కీ గుండా రాజ్, రాజా విక్రమార్క, SP పరుశురాం.. సినిమాలు దర్శకుడిగా తెరకెక్కించాడు రవిరాజా. ఆ సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది.