Aha OTT : ఆహా ఓటీటీ మరో సరికొత్త ప్రయోగం.. తమిళ్ లో.. ఇండియాలోనే మొదటిసారి ఇలా..
తాజాగా ఆహా ఓటీటీ తమిళ్ లో ఓ సరికొత్త ప్రయోగం చేయనుంది.

Aha OTT Introduce first Vertical Web Series in India Streaming soon in Tamil
Aha OTT : తెలుగు ఓటీటీ ఆహా తమిళ్ లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ లో ఆహా ఓటీటీ లో రెగ్యులర్ గా కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లు తీసుకొస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఆహా. తాజాగా ఆహా ఓటీటీ తమిళ్ లో ఓ సరికొత్త ప్రయోగం చేయనుంది.
సాధారణంగా మనం సినిమాలు, సిరీస్ లు హారిజాంటల్(అడ్డంగా) గా చూస్తాము. ఫోన్ లో చూసినా ఫోన్ ని అడ్డంగా తిప్పి చూస్తాము. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రం వర్టికల్(నిలువుగా)గా ఉంటాయి. ఇప్పుడు ఆహా కూడా ఓ వెబ్ సిరీస్ ని వర్టికల్ గా తీసుకురానున్నట్టు ప్రకటించింది. అసలు సినిమా, సిరీస్ అంటే ఎక్కడైనా అడ్డంగానే ఉంటుంది. అలాంటిది ఆహా మొదటిసారి ఫోన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడానికి కంటెంట్ ని నిలువుగా చూపించనుంది.
దీనికి సంబంధించి ఇండియాలోనే మొదటి వర్టికల్ వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నాము అంటూ ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఆ సిరీస్ పేరు అప్సర అని కూడా ప్రకటించింది. ఈ సిరీస్ ఫాంటసీ జానర్లో తెరకెక్కనుంది. ముఖ్యంగా మొబైల్ ఆడియన్స్ కి మంచి వ్యూయింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి ఆహా ఇలా ప్లాన్ చేస్తుంది.
బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో అప్సర సిరీస్ స్టన్నింగ్ విజువల్స్, స్టోరీ టెల్లింగ్ తో రానుంది. ఇది యానిమేటెడ్ సిరీస్ అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆహా తమిళ్ కంటెంట్ సీనియర్ వైస్ ప్రసిడెంట్ కవిత జుబిన్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో ఇలాంటి వర్టికల్స్ ఇంకా వస్తాయి. ఈ ఫార్మేట్ లో చూడటం స్టోరీ టెల్లింగ్ అనుభూతి కూడా కొత్తగా ఉంటుంది. ఇంకా తొందరగా కనెక్ట్ అవుతారు. మొబైల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా మేము డెవలప్ చేస్తున్నాం. అప్సర డిజిటల్ కంటెంట్ లో గేమ్ చెంజర్ అవుతుంది. మైథలాజి, మిస్టరీ, మోడ్రన్ కథతో త్వరలోనే అప్సర సిరీస్ రానుంది అని తెలిపారు.
మరి ఇండియాలోనే మొదటిసారి ఒక వెబ్ సిరీస్ ని నిలువుగా చూసేలా ఆహా కొత్తగా డిజైన్చేస్తుంది. మరి ఇది ఏ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి.