Mokshagna : గందరగోళంగా మోక్షజ్ఞ ఎంట్రీ.. సినిమా ఉందా లేదా? ఏం జరుగుతుంది బాబు.. బాలయ్య వారసుడు ఎప్పుడొస్తాడు?

మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతున్నా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

Mokshagna : గందరగోళంగా మోక్షజ్ఞ ఎంట్రీ.. సినిమా ఉందా లేదా? ఏం జరుగుతుంది బాబు.. బాలయ్య వారసుడు ఎప్పుడొస్తాడు?

Balakrishna Son Nandamuri Mokshagna First Movie with Prasanth Varma in Confusion

Updated On : February 26, 2025 / 7:35 PM IST

Mokshagna : తన నటవారసుడిగా కుమారుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నాడు. ఐతే ఎందుకో కానీ ముహూర్తం అసలు సెట్ అవడం లేదు. లాస్ట్ ఇయర్ మోక్షు బర్త్ డే సందర్భంగా డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మతో సినిమా అంటూ ప్రకటన వచ్చింది. మోక్షు మేకోవర్ అవుతున్నాడని, త్వరలో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం అనుకున్నారంతా.

మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్.. సినిమాపై మంచి అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆలస్యం అవుతూ వస్తోంది. బాలయ్య కూడా అనుకోకుండా పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయ్ అని చెప్పాడు. మధ్యలో ఈ సినిమా ఉందా లేదా అనే చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు సడెన్‌గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మళ్లీ డీలా పడిపోతున్నారు.

Also Read : Shah Rukh Khan : ‘మన్నత్’ ని వదిలి వెళ్ళిపోతున్న షారుఖ్.. నిరాశలో ఫ్యాన్స్.. ఇకపై ముంబై వెళ్తే షారుఖ్ ఫ్యాన్స్ కి కష్టమే..

మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతున్నా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయ్. మోక్షజ్ఞతో సినిమా క్యాన్సిల్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. నిజంగా ఇదే నిజమా? అదే నిజం అయితే బాలయ్య ఎలా ఒప్పుకున్నారు? అసలు ఇదంతా బాలకృష్ణకు తెలిసే జరిగిందా? సినిమా క్యాన్సిల్ అనేది ఉత్తి ప్రచారమేనా అంటూ రకరకాల అనుమానాలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తిరుగుతున్నాయ్.

Also Read : Prabhas : ఇదెక్కడి మాస్ రా బాబు.. ఆ దేశంలో ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు.. అదిరింది డార్లింగ్ అంటున్న ఫ్యాన్స్..

ఇది నిజమా.. ఫేక్ ప్రచారమా అనేది ఎలా ఉన్నా మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అవాంతరాలు ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ప్రశాంత్ వర్మ గతంలో రణ్‌వీర్ సింగ్‌తో ఓ మూవీ అనుకున్నాడు. ఎందుకో ఆ తర్వాత అది ముందుకు వెళ్లలేదు. అదే కథతో ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడని టాక్. దాని కోసమే మోక్షజ్ఞ సినిమాను పక్కనపెట్టాడా అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అని సాగదీసి సినిమా అనౌన్స్ చేసాక ఇలా అవాంతరాలు ఎదురవుతుండటం గమనార్హం. మరి నందమూరి మోక్షజ్ఞ స్క్రీన్ పై ఎప్పుడు కనపడతాడో ఫ్యాన్స్ ని ఎప్పుడు అలరిస్తాడో చూడాలి.