Telugu Film Producer Council Elections : మీడియా ముందుకు వచ్చిన సి కళ్యాణ్.. ప్రొడ్యూసర్ గిల్డ్ పై కామెంట్స్!

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ ముగిశాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు మద్దతుదారులే గెలిచారు. ఇక రిజల్ట్ వచ్చిన అనంతరం సి కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి..

Telugu Film Producer Council Elections c kalyan comments

Telugu Film Producer Council Elections : టాలీవుడ్ లో రెండేళ్ళకి ఒకసారి జరగవలసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. పరిస్థితులు అన్ని నార్మల్ అయినా నిర్మాత మండలి ఎన్నికల పెట్టకపోవడంతో.. ఇటీవల చిన్న నిర్మాతల పెద్ద గొడవే చేశారు. దీంతో ఎన్నికలను ప్రకటించగా, నేడు (ఫిబ్రవరి 19) ఈ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దిల్ రాజు మద్దతుతో దామోదర ప్రసాద్ వర్గం, సి కళ్యాణ్ మద్దతుతో జెమిని కిరణ్ వర్గం ఎన్నికలకు వచ్చాయి.

Telugu Film Producer Council Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ రిజల్ట్.. దిల్ రాజు వర్గం గెలుపు.. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర సెలెబ్రేషన్స్!

ఈ ఎన్నికల్లో దిల్ రాజు మద్దతు తెలిపిన వర్గం గెలుపు సాధించింది. 24 ఓట్లు తేడాతో జెమిని కిరణ్ పై దామోదర ప్రసాద్ గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అలాగే ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్, ట్రెజరర్ పదవికి తుమ్మలపల్లి రామ సత్యన్నారాయణ, హనరబుల్ సెక్రెటరీగా ప్రసన్న కుమార్, జాయింట్ సెక్రెటరీగా భారత్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా దిల్ రాజు మద్దతుదారులే గెలిచారు. ఇక ఎన్నికల రిజల్ట్ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు.

గెలిచిన వారికీ అభినందనలు తెలియజేస్తూ, ఎలక్షన్స్ ప్రశాంతంగా సక్సెస్ ఫుల్ గా జరిగినట్లు తెలియజేశాడు. ఈ రెండేళ్లు అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అంటూ పిలుపునిచ్చాడు. అలాగే ప్రొడ్యూసర్ గిల్డ్ గురించి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గిల్డ్ మూసేసి ఈ కౌన్సిల్ లో కలవాల్సిందే. ఒకవేళ అది మూయకపోతే రేపటి నుంచి వాళ్ళను అడిగే ప్రశ్న ఒకటే.. ‘ఎప్పుడు గిల్డ్ ముస్తారు’ అని. కాగా కరోనా సమయంలో యాక్టివ్ గా ఉన్న కొంతమంది అగ్ర నిర్మాతలు అందరూ కలిసి ఈ ప్రొడ్యూసర్ గిల్డ్ ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచే నిర్మాతల మండలిలో వివాదాలు మొదలయ్యాయి.