Trisha Politics : ఓ వైపు త్రిష వివాదం.. మరోవైపు ప్రజా సేవలోకి త్రిష అంటూ పోస్టర్లు.. హీరోయిన్ చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం..

Trisha Politics: మధురై జిల్లాలో త్రిష ఫొటోతో ఉన్న పోస్టర్లు వైరల్ గా మారాయి.

  • Updated on- August 5, 2026 / 03:31 PM IST

Udayanidhi Stalin Issue Trisha Political Posters in Tamil Nadu Goes Viral

Trisha – Tamil Nadu: ఇప్పుడు తమిళ రాజకీయాలు త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. తమిళనాడు ఎన్నికల ముందు ఎప్పట్నుంచో రూమర్స్ గా ఉన్న త్రిష – విజయ్ బంధం నిజమంటూ వార్తలు రావడం, విజయ్ భార్య విడాకులకు అప్లై చేయడం, విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పడం, త్రిష విజయ్ పార్టీ కోసం పని చేయడం, విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి త్రిష రావడం, త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం, త్రిష – విజయ్ కలిసి తిరగడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిన సంఘటనలతో త్రిష – విజయ్ బంధం రోజూ వార్తల్లో నిలుస్తుంది.

త్రిష అధికారికంగా TVK పార్టీలో చేరి తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఆమెకు డిప్యూటీ సీఎం పదవి కూడా విజయ్ ఇస్తాడని ఊహాగానాలు నడిచాయి. తాజాగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఓ సభలో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసారు. దీంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. TVK పార్టీ వర్సెస్ DMK పార్టీలు తమిళనాడు రోడ్లపై నినాదాలు చేస్తూ ఎవరికి వారు ధర్నాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీల వివాదంలో త్రిష పేరు బాగా నలుగుతుంది. ఇలా ఓ వైపు త్రిష పేరుతో వివాదం నడుస్తుంటే మరో వైపు త్రిష ప్రజాసేవలోకి రావాలని ఆమె ఫ్యాన్స్ పోస్టర్లు ఏర్పాటు చేయడం చర్చగా మారింది.

Also Read – Boat Captain License : ఈ హీరోకి బోట్ కెప్టెన్ లైసెన్స్ ఉందని తెలుసా..? ఏకంగా దుబాయ్ లో 40 అడుగుల బోట్ ని కొనుక్కొని..

మధురై జిల్లాలో త్రిష ఫొటోతో ఉన్న పోస్టర్లు వైరల్ గా మారాయి. ఈ పోస్టర్స్ ను ఆమె ఫ్యాన్స్ ఏర్పాటు చేసారు. ఈ పోస్టర్స్ పై.. మా అక్క త్రిష కోసం ‘మదురై జిల్లా త్రిష నర్పణి మండ్రం’ ఏర్పాటైంది. ప్రజల కోసం పనిచేసే నాయకురాలిగా ఆమెను చూడాలనుకుంటున్నాం. ప్రతి రాజకీయ పార్టీ మధురై నుంచే మొదలైంది. ఆమె ప్రయాణం కూడా ఇక్కడ నుంచే మొదలవ్వాలి. తమిళనాడు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన మొదటి ఫ్యాన్స్ క్లబ్ మధురై జిల్లా ఫ్యాన్స్ క్లబ్. త్వరలోనే ఆమె పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాలకు త్రిష హాజరు అవుతారు అని పేర్కొన్నారు.

అంతే కాకుండా పోస్టర్స్ పై త‌మిళ వీర వ‌నిత వేలు నాచియార్‌ ఫొటోలు వేసి ఆమెతో త్రిష‌ను పోల్చారు. దీంతో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన త్రిష పోస్టర్స్ వైరల్ అవ్వడంతో మరోసారి త్రిష రాజకీయ ప్రవేశం చర్చగా మారింది. ఈ వివాదం, పోస్టర్స్.. వీటిపై ఇప్పటికైనా త్రిష స్పందిస్తుందా చూడాలి.

Also Read – Bhagyashri Borse : లెనిన్ హిట్ తర్వాత మోడ్రన్ లుక్స్ లో భాగ్యశ్రీ భోర్సే..