Thaman : తమన్ ని మోసం చేసిన ఫ్రెండ్.. మొత్తం డబ్బులు పోయి.. ఆఖరికి బియ్యం కొనుక్కోడానికి కూడా..
తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో ఓ ఫ్రెండ్ చేసిన మోసాన్ని, ఆ సంఘటనని పంచుకున్నాడు. (Thaman)
Thaman
Thaman : అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. గత కొంతకాలంగా వరుస సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ తో ట్రెండ్ లో ఉంటున్నాడు తమన్. తమన్ ఎన్నో కష్టాలు పడితండ్రి లేకుండానే చిన్నప్పట్నుంచి పని చేస్తూ పైకి వచ్చాడని తెలిసిందే
తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో ఓ ఫ్రెండ్ చేసిన మోసాన్ని, ఆ సంఘటనని పంచుకున్నాడు.
Also See : Bigg Boss Thrigun : బిగ్ బాస్ సీజన్ 10 త్రిగున్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా? భార్యతో క్యూట్ ఫొటోలు..
తమన్ మాట్లాడుతూ.. సరైనోడు సినిమా తర్వాత 2016 లో నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నాకు ఒక ఫైనాన్స్ ఇష్యూ వచ్చింది. ఆ సమయంలో నేను ఒక ఫ్రెండ్ ని నమ్మి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను. అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అతను నన్ను చాలా ట్రబుల్స్ లో పెట్టాడు. ఆ టైంలో నేను జీరోకి వచ్చేసా. అప్పటివరకు నేను సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాను. ఆ సమయంలో బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఒక అగ్రిమెంట్ సైన్ చేసింనందుకు డే లైట్ లో నన్ను మోసం చేశారు. కానీ నేను పడిపోకుండా మరింత స్ట్రాంగ్ అయ్యాను. ఆ సమయంలో మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ సినిమాలు వచ్చి నన్ను నిలబెట్టాయి అని తెలిపాడు.
