Unstoppable Season 4 : యానిమేషన్ తో సిరీస్ ప్రోమో చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఆహా.. బాలయ్య అన్‌స్టాపబుల్..

అన్‌స్టాపబుల్ షో కోసం ఆహా కొత్తగా ఆలోచించి బాలయ్య పండుగ అంటూ యానిమేషన్ తో సరికొత్త ప్రోమో చేసారు.

Aha Designed Animation Promo for Balakrishna Unstoppable Season 4

Unstoppable Season 4 : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మూడు పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. నిన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అనౌన్స్ చేసి దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఇన్నాళ్లు ప్రోమోలు అంటే ఆ షోని, షోలో జరిగే వాటిని చూపిస్తారు.

కానీ అన్‌స్టాపబుల్ షో కోసం ఆహా కొత్తగా ఆలోచించి బాలయ్య పండుగ అంటూ యానిమేషన్ తో సరికొత్త ప్రోమో చేసారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇలా ఒక టాక్ షో కోసం యానిమేషన్ ప్రోమో చేసి ఆహా సరికొత్త చరిత్ర సృష్టించింది. బాలయ్య అభిమానులు అయితే తమ హీరోని యానిమేషన్ లో మాస్ సూపర్ హీరోగా చూసుకొని మురిసిపోయారు.

Also Read : Chandrababu Naidu : కొడుకు నిశ్చితార్థంలో సీఎం చంద్రబాబు నాయుడు.. ఫోటో వైరల్..

ప్రోమోని ఇలా కొత్తగా యానిమేషన్ తో చేసి ప్రమోట్ చేస్తున్నారు ఆహా టీమ్. మరి మున్ముందు బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 ని ఇంకే రేంజ్ లో ప్రమోట్ చేస్తారో చూడాలి. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజ్ 4 లో పలు ఎపిసోడ్స్ కూడా షూట్ చేసేశారంట. దీంతో ఈసారి ఏ సెలబ్రిటీలను బాలయ్య తెస్తారో అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అన్‌స్టాపబుల్ షో సీజన్ 4 ప్రోమో చూసేయండి..