Aha Dance Ikon : ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 వచ్చేసింది.. మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆడిషన్ ఇచ్చేయండి..
ఓంకార్ హోస్ట్ గా ఆహా డ్యాన్స్ ఐకాన్ గతంలో మొదటి సీజన్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సీజన్ మొదలు కానుంది.

Aha OTT Dance Ikon 2 Calling for Auditions From Dancers Details Here
Aha Dance Ikon : తెలుగు ఓటీటీలో ఆహా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. పలు ప్రోగ్రామ్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అలాగే కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి కూడా పలు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ అని సింగర్లని ఎంకరేజ్ చేస్తూ ఓ ప్రోగ్రాం చేయగా ఇప్పుడు డ్యాన్సర్స్ ని ఎంకరేజ్ చేయడానికి మరో ప్రోగ్రాం మొదలు కానుంది.
ఓంకార్ హోస్ట్ గా ఆహా డ్యాన్స్ ఐకాన్ గతంలో మొదటి సీజన్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సీజన్ మొదలు కానుంది. తాజాగా నేడు ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 ప్రకటించి దానికోసం ఇంటర్నేషనల్ వైడ్ ఆన్లైన్ ఆడిషన్స్ తీసుకోబోతున్నట్టు తెలిపారు. అన్ని రకాల డ్యాన్స్ చేసే వాళ్ళను ఈ షోకు ఆహ్వానిస్తున్నారు. 6 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు మధ్యలో ఉన్నవాళ్లు ఈ డ్యాన్స్ ఆడిషన్స్ కు అప్లై చేసుకోవచ్చు. సోలో, గ్రూప్, డ్యూయెట్ పర్ఫార్మెన్స్ లు కూడా ఇవ్వొచ్చు. అయితే ఆడిషన్ ఇచ్చే వీడియో 90 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. మీ డ్యాన్స్ వీడియో 50 MB సైజు లోపే ఉండాలి. http://aha.video/dance-ikon-auditions ఈ లింక్ ఓపెన్ చేసి మీ డ్యాన్స్ వీడియోని సబ్మిట్ చేయొచ్చు.
Also Read : Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ తో.. ట్రైలర్ ఎప్పుడంటే..
ఈ డ్యాన్స్ ఐకాన్ ఆడిషన్స్ కోసం ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ లింక్ లో ఉంటుందని తెలిపారు ఆహా టీమ్. డ్యాన్సర్స్ తమ ఆడిషన్స్ వీడియోలను నవంబర్ 10 నుంచి 16 వరకు మధ్యలో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 కి అప్లై చేసేయండి. ఇక ఈ సారి కూడా ఈ షోని ఓంకార్ హోస్ట్ చేయబోతున్నాడు.