Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ తో.. ట్రైలర్ ఎప్పుడంటే..

తాజాగా పుష్ప 2 సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.

Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ తో.. ట్రైలర్ ఎప్పుడంటే..

Allu Arjun Sukumar Pushpa 2 Movie Trailer Update Announced

Updated On : November 11, 2024 / 4:10 PM IST

Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్, టీజర్.. రిలీజయి భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్స్ చేయనున్నారని ప్రకటించారు. ఈసారి పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు ఇటీవలే పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.

Also Read : Pushpa 2 : ‘పుష్ప 2’ స్పెషల్ అగరబత్తి.. లిమిటెడ్ ఎడిషన్.. షేర్ చేసిన బన్నీ భార్య..

ఇక ఫ్యాన్స్ అంతా పుష్ప 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. పుష్ప 2 సినిమా ట్రైలర్ ను నవంబర్ 17 న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు అల్లు అర్జున్ గన్ పట్టుకున్న స్టైలిష్ పోస్టర్ కూడా షేర్ చేసారు.

Image

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.