Pushpa 2 : ‘పుష్ప 2’ స్పెషల్ అగరబత్తి.. లిమిటెడ్ ఎడిషన్.. షేర్ చేసిన బన్నీ భార్య..

తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుష్ప 2 లిమిటెడ్ ఎడిషన్ అగరబత్తి ప్యాకెట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

Pushpa 2 : ‘పుష్ప 2’ స్పెషల్ అగరబత్తి.. లిమిటెడ్ ఎడిషన్.. షేర్ చేసిన బన్నీ భార్య..

Allu Arjun Pushpa 2 Mangal Deep incense stick Packs with Pushpa Getup Photos Limited Edition

Updated On : November 11, 2024 / 3:40 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

Also Read : Samantha : నేను తల్లిని కావాలని ఇప్పటికి కలలు కంటాను.. ఇంకా ఆలస్యం అవ్వలేదు.. సమంత వ్యాఖ్యలు..

ఇక పుష్ప 2 పై ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అందరూ చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళ్ దీప్ కంపెనీ సెంట్ అనే పేరుతో అల్లు అర్జున్ పుష్ప గెటప్ ఫొటో వేసి పుష్ప 2 అని ఓ అగరబత్తి ప్యాకెట్ ఇటీవల విడుదల చేసారు. దానిపై లిమిటెడ్ ఎడిషన్ అని కూడా రాసుకొచ్చారు. దీనికి సంబంధించి నెల రోజుల క్రితం ఓ యాడ్ కూడా రిలీజ్ చేసారు. పుష్ప 2 సినిమాకు అధికారికంగా డివోషనల్ పార్ట్నర్ అని, లిమిటెడ్ ఎడిషన్ తో ఈ అగరబత్తి ప్యాకెట్స్ ని పుష్ప 2 టైటిల్, అల్లు అర్జున్ ఫొటోతో రిలీజ్ చేస్తున్నారు.

Allu Arjun Pushpa 2 Mangal Deep incense stick Packs with Pushpa Getup Photos Limited Edition

అయితే తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుష్ప 2 లిమిటెడ్ ఎడిషన్ అగరబత్తి ప్యాకెట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. బన్నీ ఫ్యాన్స్ ఈ మంగళ్ దీప్ పుష్ప 2 అగరబత్తిని వైరల్ చేస్తున్నారు. మరి పుష్ప 2 క్రేజ్ తో మంగళ్ దీప్ అగరబత్తి సేల్స్ పెరుగుతాయేమో చూడాలి.