Samantha : నేను తల్లిని కావాలని ఇప్పటికి కలలు కంటాను.. ఇంకా ఆలస్యం అవ్వలేదు.. సమంత వ్యాఖ్యలు..
సిటాడెల్ సిరీస్ లో సమంత ఓ బాలికకు తల్లిగా కూడా నటించింది.

Samantha Interesting Comments on Motherhood in Citadel Promotions
Samantha : సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒక సంవత్సరం కాలం నుంచి ఆరోగ్య సమస్యలు అని సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే సిరీస్ లు, సినిమాలు మొదలుపెడుతుంది. సమంత గతంలో నటించిన సిటాడెల్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజయింది. ఈ సిరీస్ కు భారీగానే ప్రమోషన్స్ చేసారు.
అయితే తాజాగా సమంత ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది. అయితే సిటాడెల్ సిరీస్ లో సమంత ఓ బాలికకు తల్లిగా కూడా నటించింది. దీంతో అమ్మతనం గురించి, తల్లిగా నటించారు దాని ఫీల్ ఎలా ఉంది, తల్లిగా ఉండటం మిస్ అవుతున్నారా అనే ప్రశ్న సమంతకు ఎదురైంది. దీనిపై సమంత ఆసక్తికర సమాధానమిచ్చింది.
Also Read : Sudheer – Imanvi : సుడిగాలి సుధీర్ సినిమా రిజెక్ట్ చేసి.. ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పిన ఇమాన్వి..
సమంత మాట్లాడుతూ.. నేను ఇంకా దానికి ఆలస్యం అయిందని అనుకోవట్లేదు. ఇప్పటికి నేను తల్లి కావాలని కలలు కంటాను. అది ఒక అందమైన అనుభవం. తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను. అందరూ ఏజ్ గురించి మాట్లాడతారు. కానీ తల్లి అవ్వడానికి ఒక సమయం అంటూ ఉండదు అని తెలిపింది. దీంతో సమంత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలతో సమంతకి తల్లి అవ్వాలని ఉందని తెలుస్తుంది. మరి నాగచైతన్య రెండో పెళ్ళికి రెడీ అయినట్టు సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకొని తల్లి అవుతుందా లేక సరోగసి పద్దతిలో తల్లి అవుతుందా లేదా ఎవర్నైనా దత్తత తీసుకుంటుందా చూడాలి మరి.