ALA Amerikapurramullo : ‘ఆహా’ సమర్పణలో.. ‘అలా అమెరికాపురములో’

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో.. ‘అలా అమెరికాపురములో’ పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ కాన్సర్ట్స్‌ను ‘ఆహా’ సమర్పిస్తోంది..

ALA Amerikapurramullo : ‘ఆహా’ సమర్పణలో.. ‘అలా అమెరికాపురములో’

Ala Amerikapurramullo

Updated On : September 12, 2021 / 12:22 PM IST

ALA Amerikapurramullo: బ్లాక్ బస్టర్ సినిమాలు, సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే షో లతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుని, డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో.. ‘అలా అమెరికాపురములో’ పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ కాన్సర్ట్స్‌ను ‘ఆహా’ సమర్పిస్తోంది.

Maha Ganesha : ‘ఆహా’ స్పెషల్.. పిల్లలకు ప్రసాదంతో పాటు వినాయకుడి కథ కూడా..

సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటు చేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్‌ను ‘అలా అమెరికాపురములో’ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజిక‌ల్ కార్నివాల్ అద్భుతమైన ప్రదర్శన కోసం అమెరికాకు తీసుకువస్తోంది. హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు గతంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఏఆర్ రెహమాన్ మరియు అనిరుధ్ రవిచంద‌ర్‌ల‌తో కలిసి అతిపెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహించారు.

Bigg Boss 5 Telugu : సరయు ఎలిమినేషన్..?

ప్ర‌స్తుతం తమన్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నారు. స్టార్స్‌ మరియు సంగీత ప్రియులు ఎక్కువగా త‌మ‌న్ సంగీతాన్నే కోరుకుంటున్నారు. అక్టోబర్ మరియు నవంబర్ నెల‌లో తమన్ యునైటెడ్ స్టేట్స్‌లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్‌లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

The Baker And The Beauty : ‘ఆహా’ లో మరో డిఫరెంట్ ఒరిజినల్

అక్టోబర్ 30, నవంబర్ 5, 7 మరియు 26వ తేదీల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. టికెట్స్ కావాలనుకున్న వారు www.sulekha.com లో బుక్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలియ‌జేసి అంద‌రితో క‌లిసి జీవితాన్ని ఆనందించే పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ అతిపెద్ద మ్యూజికల్ బొనాంజాలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మరియు స్టార్ హీరోలు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు, మరియు ఇతర ప్రముఖులు తమన్‌తో కలిసి ప్రదర్శనలు ఇవ్వ‌నున్నారు.

యునైటెడ్ స్టేట్స్‌లోని సంగీతాభిమానుల‌కు ది బెస్ట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియ‌న్స్ అందించడానికి భారీ స్టేజ్ ప్రొడక్షన్‌తో పాటలు, నృత్యాలు, స్కిట్‌లు మరియు విజువల్ ట్రీట్‌లతో వినోదంతో పూర్తిస్థాయిలో ఉండేలా ఈవెంట్స్ ప్లాన్ చేయబడ్డాయి. రష్యన్, బెలారస్ నృత్యకారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కళాకారులు వారి పెర్ఫామెన్స్‌ల‌తో ఈ ఈవెంట్‌ను ప్ర‌త్యేకంగా చేయ‌నున్నారు.

Ram Charan : మెగా పవర్‌స్టార్.. వెయ్యి కోట్ల హీరో..