Maha Ganesha : ‘ఆహా’ స్పెషల్.. పిల్లలకు ప్రసాదంతో పాటు వినాయకుడి కథ కూడా..

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.. తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజిన‌ల్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న ప్ర‌సారం చేయ‌నుంది..

Maha Ganesha :   ‘ఆహా’ స్పెషల్.. పిల్లలకు ప్రసాదంతో పాటు వినాయకుడి కథ కూడా..

Maha Ganesha Trailer

Maha Ganesha: బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలతో తెలుగువారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అటు డిజిట‌ల్ మాధ్య‌మంలోనూ, ఇటు తెలుగువారి హృద‌యాల్లోనూ తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.. తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజిన‌ల్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న ప్ర‌సారం చేయ‌నుంది.

The Baker And The Beauty : ‘ఆహా’ లో మరో డిఫరెంట్ ఒరిజినల్

‘ఆహా కిడ్స్’ ద్వారా మ‌న పురాణ క‌థ‌లు, విలువ‌లును తెలియ‌జేసేలా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను ఈత‌రం చిన్నారుల‌కు అందిస్తోంది. ‘మహా గణేశ’.. ఈ వెబ్ యానిమేటెడ్ ఒరిజిన‌ల్‌ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేష‌న్ ప్రై.లి క‌ల‌యిక‌లో రాజీవ్ చిల‌క తెర‌కెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్ర‌తి ఎపిసోడ్ వ్య‌వ‌ధి 15 నిమిషాలుంటుంది. ఇది మ‌న దేవ‌త‌ల్లో ప్ర‌థ‌మ పూజ‌లు అందుకునే విఘ్నేశ్వ‌రుడికి సంబంధించిన పండుగ వినాయ‌క చ‌వితి పురాణాన్ని తెలియ‌జేస్తుంది. వినాయ‌క చ‌వితి ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ సిరీస్ ఉంటుంది.

Aha: వినాయ‌క చ‌వితి స్పెషల్, ఆహాలో చిన్నారుల కోసం ఫస్ట్ కిడ్స్ యానిమేటెడ్ ‘మహా గణేశ’!

వినాయ‌కునికి ఏనుగు త‌ల‌ను ఎందుకు పెట్టారు, అలాగే త‌న త‌మ్ముడు కార్తికేయ‌తో గ‌ణేశుడు ఎందుకు పోటీ ప‌డి మూడుసార్లు మూల్లోకాల‌ను ప్ర‌ద‌క్షిణాలు చేశారు. చంద్రుడికి, వినాయ‌క చ‌వితినాడు ఎందుకు శాపం పెట్టారు, రాక్ష‌స‌రాజు గ‌జాసురుడిని వినాయ‌కుడు మ‌ధ్య యుద్ధం త‌దిత‌ర విష‌యాల‌న్నీ ఈ వెబ్ సిరీస్‌లో క‌థ‌లాగా పొందుప‌రిచారు.

Tharagathi Gadhi Daati : ‘ఆహా’ లో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’..

ఈ షో మ‌న పురాణ‌గాథ‌. దీన్ని స‌రికొత్తగా, చ‌క్క‌టి విజువ‌ల్స్‌తో, మంచి సౌండ్‌, స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించారు. ఇది పిల్ల‌ల‌నే కాదు, పెద్ద‌ల‌ను కూడా మెప్పిస్తుంది. ‘మహా గణేశ’ను కౌశిక్ కర్ర ర‌చించ‌గా, శ్రీనివాస శర్మా రాణి సంగీతాన్ని అందించారు. జి.డి.ఆర్.మోహన్, ఎ.గంగరాజ్ చరణ్ యానిమేషన్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. టి.ఎ.కె.కుమార్ ఈ షోకు వాయిస్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు.

Maha Ganesha

 

బుధవారం ‘మహా గణేశ’ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పిల్లలతో పాటు పెద్దవారిని కూడా ఆకట్టుకుంటోందీ ట్రైలర్. రెండు నిమిషాల 25 సెకన్ల వ్యవధిగల ట్రైలర్‌లో క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు. క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం అలరిస్తుంది. ట్రైలర్ విజువల్‌గానూ చాలా బాగుంది. ఆర్ఆర్ చక్కగా కుదిరింది. ఈ వినాయక చవితికి ‘మహా గణేశ’ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మరి ముఖ్యంగా చిన్నారులను మరో సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోంది తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’..