Aha Suma Kanakala Chef Mantra Project K - Episode 2 Promo Released
Chef Mantra : ఆహా ఓటీటీలో సరికొత్త షో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఇటీవల మొదలయిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలకు వంటల పోటీలు పెట్టి సుమ యాంకరింగ్ తో, జీవన్ కుమార్ జడ్జిగా ఫుల్ కామెడీతో ఈ షోని నడిపిస్తున్నారు. తాజాగా ఈ షో రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
ఈ ఎపిసోడ్ లో సెలబ్రిటీలకు పూతరేకులు తయారుచేయాలని టాస్క్ ఇచ్చారు. మరి సెలబ్రిటీలు పూతరేకులు ఎలా తయారుచేసారో చూడాలంటే మార్చ్ 13 గురువారం రాత్రి 7 గంటలకు వచ్చే ఎపిసోడ్ లో చూసేయాల్సిందే. ఈ పూతరేకులు తయారుచేసే క్రమంలో సెలబ్రిటీలు ఫుల్ గా నవ్వించారు.
ఇక ఈ ఎపిసోడ్ కి సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల గెస్ట్ గా వచ్చారు. సుమ – రాజీవ్ ల 26వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసారు. ఈ జంట క్యూట్ గా తన ప్రేమతో అలరించింది. మీరు కూడా ఆహా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఎపిసోడ్ 2 ప్రోమో చూసి నవ్వేసేయండి..