Heroins Remunerations : సాయి పల్లవి, సమంత, రష్మిక.. భారీగా పెంచేసిన రెమ్యునరేషన్స్.. ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

ఇప్పుడు సక్సెస్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ భారీగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.

Heroins Remunerations : సాయి పల్లవి, సమంత, రష్మిక.. భారీగా పెంచేసిన రెమ్యునరేషన్స్.. ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

Samantha Sai Pallavi Rashmika Taking Huge Remunerations

Updated On : March 9, 2025 / 3:35 PM IST

Heroins Remunerations : హీరోలకు భారీగా కోట్లల్లో రెమ్యునరేషన్స్ ఉంటుంది. ఇప్పుడు 100 కోట్లు తీసుకునే స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో హీరోయిన్స్ కి కూడా భారీగా రెమ్యునరేషన్స్ పెరిగాయి. బాలీవుడ్ లో అయితే హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు సక్సెస్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ భారీగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.

సాయి పల్లవి అడపాదడపా సినిమాలు చేస్తున్నా మంచి హిట్స్ కొడుతుంది. ఇటీవల సాయి పల్లవి వరుసగా అమరన్, తండేల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్స్ కొట్టింది. సాయి పల్లవి తండేల్ సినిమాకు 5 కోట్ల రెమ్యునరేషన్స్ అందుకుంది టాక్. ఇప్పుడు బాలీవుడ్ లో సాయి పల్లవి రామాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా సాయి పల్లవి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇది భారీ సినిమా, బాలీవుడ్ సినిమా, తనదే మెయిన్ సీత పాత్ర కావడంతో సాయి పల్లవికి ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

Also Read : Raviteja : మాస్ మహారాజ ఆ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నాడా? ‘మాస్ జాతర’ కోసం..

గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత కూడా రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటుందట. గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కి 3 కోట్లు తీసుకుందని వార్తలు వచ్చాయి. యశోద లేడీ ఓరియెంటెడ్ సినిమాకు, ఖుషి సినిమాకు కూడా 3 కోట్లు తీసుకుంది అన్నారు. ఇటీవల బాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత 8 కోట్లు తీసుకుందట. ఇప్పుడు సమంత చేతిలో బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ ఉంది. ఈ సిరీస్ మొత్తానికి సమంత ఏకంగా 10 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం సమంతకు మార్కెట్ లేకపోయినా సిరీస్ లు కాబట్టి ఆ రేంజ్ లో ఇస్తున్నారట.

ఇక వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది రష్మిక. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ స్టార్ హీరోయిన్ రష్మికనే. అన్ని సినీ పరిశ్రమలలో పెద్ద హిట్స్ ఇచ్చింది. మొన్నటిదాకా రష్మిక 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేది. ఇటీవల ఛావా సినిమాలో చిన్న పాత్రే అయినా 4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. పుష్ప 2 సినిమాలకు కలిపి 10 కోట్లు ఇచ్చారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పుడు రష్మిక 4 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం.

Also Read : Tollywood Heros : నిర్మాతలుగా మారి బిజీ అవుతున్న హీరోలు..

ఇలా స్టార్ హీరోయిన్స్ అంతా రెమ్యునరేషన్స్ భారీగానే తీసుకుంటూ స్టార్ డమ్ ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.