Telugu Indian Idol : నేడే హైదరాబాద్ లో ఆడిషన్స్.. ఆహా సింగింగ్ షోలో పాల్గొనండి.. ఎక్కడ..?
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకోగా త్వరలో నాలుగో సీజన్ మొదలు కానుంది.

Telugu Indian Idol
Telugu Indian Idol : తెలుగు ఓటీటీ ఆహాలో కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాడానికి సాంగ్స్, డ్యాన్స్ షోలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకోగా త్వరలో నాలుగో సీజన్ మొదలు కానుంది.
ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోతో ఎంతోమంది లోకల్ సింగర్స్ ని పరిచయం చేసారు. తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కి గత కొన్ని రోజులుగా ఆన్లైన్ లో ఆడిషన్స్ అవ్వగా ఇప్పుడు ఆఫ్ లైన్ లో ఆడిషన్స్ జరగనున్నాయి.
Also Read : Allu Aravind : పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. సనాతన ధర్మంపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
హైదరాబాద్ లోని JNTUH మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రిషి ఎమ్.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో నేడు ఆగస్ట్ 3న గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల మంది ఆడిషన్స్ లో పాల్గొనడానికి వచ్చారు. నేడు సాయంత్రం వరకు ఆడిషన్స్ జరుగుతాయని సమాచారం. ఈసారి కూడా షోలో గీతామాధురి, తమన్, కార్తీక్ లు గెస్టులుగా ఉండబోతున్నారు. మీరు కూడా సింగర్ అవ్వాలనుకుంటే ఈ ఆడిషన్స్ కి వెళ్లి ఆహా షోలో పాడే ఛాన్స్ కొట్టేయండి.
Every dream has a voice.
Let yours be heard on the biggest Singing stage.Auditions are happening on August 3! Come, participate let the world hear your voice. @MusicThaman pic.twitter.com/c6f4foPRJr
— ahavideoin (@ahavideoIN) July 30, 2025
Also Read : Kingdom Collections : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..?