Aha Telugu Indian Idol : అమెరికాలో మొదటిసారి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్..

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోసం అమెరికాలో మొదటిసారి మెగా ఆడిషన్స్ చేస్తున్నారు.

Aha Telugu Indian Idol Season 3 Auditions Happening in America Also

Aha Telugu Indian Idol : తెలుగు ఓటీటీ ఆహా రెగ్యులర్ గా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో, సినిమాలతో మెప్పిస్తుంది. ఆల్రెడీ ఆహా ఓటీటీలో సక్సెస్ అయిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. గతంలో సినీ పరిశ్రమకు ఎంతోమంది సింగర్స్ ని పరిచయం చేసి, ఎంతోమందిలో ఉన్న సింగింగ్ ట్యాలెంట్ బయటకి తీసిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో మళ్ళీ మొదలు కానుంది. దాని కోసం ఈసారి ఇండియాతో పాటు అమెరికాలో కూడా ఆడిషన్స్ చేస్తున్నారు.

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోసం అమెరికాలో మొదటిసారి మెగా ఆడిషన్స్ చేస్తున్నారు. మే 4న న్యూజెర్సీలో TV9 USA స్టూడియోస్,399 హూస్ లేన్ 2nd ఫ్లోర్ పిస్కాటవేలో ఆడిషన్స్ జరగ్గా, మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్ 4440 హెచ్.డబ్ల్యువై 121 టీవెసిల్, USA టెక్సాస్ విల్,లూయిస్ విల్లే #5లలో ఆడిషన్స్ జరగనున్నాయి. అలాగే నేడు హైదరాబాద్ లో కూడా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు పదివేల మంది ఆసక్తిగల గాయనీగాయకులు ఆడిషన్స్ కి వచ్చారని తెలుస్తుంది. వీరిలో 12 మందిని మాత్రం సీజన్ 3 ప్రోగ్రాంకి సెలెక్ట్ చేస్తారు.

Also Read : Rana Daggubati : రానా మరీ అంత నాన్ వెజిటేరియనా? బాబోయ్ ఆఖరికి అవి కూడా తిన్నాడట..

సంగీత దర్శకుడు తమన్, సింగర్స్ గీతామాధురి, కార్తీక్ లు జడ్జీలుగా, సింగర్ శ్రీరామచంద్ర యాంకర్ గా ఈ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 త్వరలోనే మొదలు కానుంది. గతంలో అల్లు అర్జున్, బాలకృష్ణ, చిరంజీవి.. లాంటి స్టార్ హీరోలు, పలువురు హీరోయిన్స్ చాలా మంది ఈ షోకి వచ్చి సందడి చేసారు. ఈసారి కూడా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి చేయనున్నారు.

 

అమెరికాలో ఉండే ఇండియన్ రెసిడెంట్స్ ఇందులో పాడాలనుకునేవారు ఆహా టీమ్ ఇచ్చిన లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 10 వరకు రిజిస్ట్రేషన్ కి అవకాశం ఉంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొనడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. https://telugu-indian-idol-auditions.aha.video