Rana Daggubati : రానా మరీ అంత నాన్ వెజిటేరియనా? బాబోయ్ ఆఖరికి అవి కూడా తిన్నాడట..
తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, బిజినెస్, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తను చాలా పెద్ద నాన్ వెజిటేరియన్ అని తెలిపాడు.

Rana Shares about his Food Habits and said he is full Non Vegetarian
Rana Daggubati : రానా దగ్గుబాటి ప్రస్తుతం సినిమాలతో, నిర్మాతగా, బిజినెస్ లతో.. బిజీగా ఉన్నాడు. సినీ పరిశ్రమలో చాలా ట్యాలెంట్స్ ఉన్న వాళ్ళల్లో రానా ఒకరు. నటుడు అవ్వకముందే సినీ పరిశ్రమలో చాలా వర్క్స్ చేసారు. టాలీవుడ్ సెలబ్రిటీలలలో చాలా మంది కంటే కూడా రానాకే బాలీవుడ్ లో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. త్వరలో రజినీకాంత్ వెట్టియన్ సినిమాలో కనిపించబోతున్నాడు.
తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, బిజినెస్, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తను చాలా పెద్ద నాన్ వెజిటేరియన్ అని తెలిపాడు.
Also Read : Rana Daggubati : కల్కిలో రానా యాక్ట్ చేస్తున్నాడా? క్లారిటీ ఇచ్చేసిన రానా..
రానా మాట్లాడుతూ.. నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. బాహుబలి నుంచి, ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రకు మారడానికి మూడు నెలలు వెజ్ డైట్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టంగా ఆ మూడు నెలలు గడిపాను. షూటింగ్ అయిపోయాక వెంటనే నాంపల్లిలో ఆదాబ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ ఓనర్ నా ఫ్రెండ్. వాడికి ఫోన్ చేసి హలీం పంపించామన్నాను. అది నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి. నేను ఆల్మోస్ట్ నాన్ వెజ్ లో అన్ని తిన్నాను. విదేశాలకు వెళ్తే అక్కడ లోకల్ గా దొరికే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తింటాను. నేనేం తిన్నానో చెప్తే మీరు భయపడతారు. పాములు, మొసళ్ళు కూడా తిన్నాను అని తెలిపాడు. దీంతో రానా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాబోయ్ మరీ ఇంత నాన్ వెజిటేరియనా అని ఆశ్చర్యపోతున్నారు.