Rana Daggubati : కల్కిలో రానా యాక్ట్ చేస్తున్నాడా? క్లారిటీ ఇచ్చేసిన రానా..
రానా కూడా కల్కి సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

Rana Gives Clarity on his Acting in Kalki 2898AD Movie Rumours
Rana Daggubati : నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. కథ పరంగా కల్కి సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి జూన్ 27న రిలీజ్ కాబోతుంది.
కల్కి సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది పేర్లు వినిపించాయి. రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కల్కి కామిక్ కాన్ ఈవెంట్లో రానా పాల్గొనడం, కల్కి గురించి రానా ప్రమోషన్స్ చేయడంతో రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
Also Read : Prabhas : ప్రభాస్ లేటెస్ట్ ఫొటో లీక్.. ఇంటికి వెళ్లిన ఫ్యాన్స్.. ప్రభాస్ ఇల్లు చూశారా..?
తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్, నేను చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్స్. లీడర్ సినిమాకి శేఖర్ కమ్ముల వద్ద నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అలా మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రెగ్యులర్ గా కలుస్తాము, సినిమాల గురించి మాట్లాడతాము. కల్కి ఇండియా సినిమా రూపు రేఖలు మారుస్తుంది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలని కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్ళాము. ఇండియాకి ఎవెంజర్స్ లాంటి సినిమా ఇది. నేను ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాను కాబట్టి నేను యాక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ నేను కల్కి సినిమాలో యాక్ట్ చెయ్యట్లేదు అని క్లారిటీ ఇచ్చారు. మరి రానా యాక్ట్ చేయకపోతే ఇంకెవరెవరు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తున్నారో చూడాలి.
#Kalki2898AD is next big thing from India – #Rana
#Prabhas #Kalki2898ADonJune27 pic.twitter.com/puTocIuwPC
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) May 4, 2024