వెంటిలేటర్‌పై నిషికాంత్ కామత్.. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన హైదరాబాద్ AIG హాస్పిటల్..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 08:57 PM IST
వెంటిలేటర్‌పై నిషికాంత్ కామత్.. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన హైదరాబాద్ AIG హాస్పిటల్..

Updated On : August 18, 2020 / 9:40 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు నిషికాంత్‌ కామత్‌ అనారోగ్యంతో కన్నుమూశారనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతున్న హైదరాబాద్ AIG హాస్పిటల్ వారు నిషికాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.



కాలేయ సిరోసిస్‌ వ్యాధితో భాధ పడుతున్న నిషి కాంత్‌కు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం.. పరిస్థితి కొంత విషమంగా వున్నా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం.. అని తెలిపారు.
గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న నిషికాంత్ హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్‌’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన నిషికాంత్ కామత్ ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్‌ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు‌. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట్ ఘరాట్‌’ అనే మరాఠీ సినిమాలోనూ, జాన్‌ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ లోనూ నటించి ఆకట్టుకున్నారు నిషికాంత్.



Nishikant Kamat