Aishwarya Lekshmi : నా ప్రొఫైల్ ఓ మ్యాట్రిమోనీలో కూడా పెట్టాను.. కానీ వాళ్లంతా రాజీ పడి బతుకుతున్నారు.. జీవితంలో పెళ్లి చేసుకోను..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

Aishwarya Lekshmi gives Clarity on Her Marriage

Aishwarya Lekshmi : కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి మలయాళం, తమిళ్ సినిమాలతో సౌత్ లో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులో కూడా గాడ్సే, అమ్ము సినిమాలు చేసింది. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సినిమాలో నటిస్తుంది. గతంలోనే ఐశ్వర్య లక్ష్మి పెళ్లి చేసుకోను అని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చింది.

Also Read : Prasanth Varma : నాకు ఛాన్స్ ఇస్తే నేను డైరెక్షన్ ఆపేసి ఆ పని చేసుకుంటాను.. హనుమాన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పటికి పెళ్లి చేసుకోను. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూసేదాన్ని. అప్పుడు నాకు కూడా పెళ్లి చేసుకోవాలి అనిపించేది. గతంలో నా ప్రొఫైల్ ఓ మ్యాట్రిమోనీలో కూడా పెట్టాను. కానీ ఇప్పుడు నాకు తెలిసిన చాలా మందిని చూస్తున్నాను. ఒకటి రెండు జంటలు తప్పితే అందరూ జీవితంలో రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగా ఎదగలేకపోతున్నారు. పెళ్లిపై నా అభిప్రాయం మారింది. అందుకే నేను ఎప్పటికి పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను అని తెలిపింది.