Prasanth Varma : నాకు ఛాన్స్ ఇస్తే నేను డైరెక్షన్ ఆపేసి ఆ పని చేసుకుంటాను.. హనుమాన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేయడంతో అతని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prasanth Varma : నాకు ఛాన్స్ ఇస్తే నేను డైరెక్షన్ ఆపేసి ఆ పని చేసుకుంటాను.. హనుమాన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Prasanth Varma Sensational Comments on his Work at Devaki Nandana Vasudeva Event

Updated On : November 20, 2024 / 8:33 AM IST

Prasanth Varma : ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా అ నుంచి కొత్త కథలతో ప్రేక్షకులని మెప్పిస్తునే వస్తున్నాడు. మొన్న సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి పాన్ ఇండియా హిట్ కొట్టి భారీ విజయం సాధించాడు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేయడంతో అతని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే అతని యూనివర్స్ లో ఓ అయిదారు సినిమాలు అనౌన్స్ చేసాడు. అందులో కొన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా మరికొన్ని అతని పర్యవేక్షణలో వేరేవాళ్లు డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మే కథ అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు బోయపాటి శ్రీనివాస్ గెస్ట్ గా వచ్చారు.

Also Read : Kriti Sanon : ప్రేమ‌లో కృతిస‌న‌న్‌..! ప్రియుడితో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ..!

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నేను సినిమాలు మొదలుపెట్టేముందే 33 కథలు రాసుకున్నాను. ఇప్పటివరకు తీసిన సినిమాలు ఆ 33 కథల్లో లేవు, మళ్ళీ అవి వేరే కథలు. నాకు కథలు రాయడం అంటే ఇష్టం. నాకు ఏ డైరెక్టర్స్ అయినా ఛాన్స్ ఇస్తే హ్యాపీగా డైరెక్షన్ ఆపేసి కథలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏ డైరెక్టర్ అడిగినా కథలు ఇస్తాను, బోయపాటి గారు అడిగినా కూడా ఇస్తాను అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రశాంత్ వర్మ ఛాన్స్ దొరికితే నిజంగానే కథలు రాసుకుంటూ కొత్త వాళ్లతో, వేరే డైరెక్టర్స్ తో సినిమాలు తీయించేలా ఉన్నాడని అర్ధమవుతుంది.