Kriti Sanon : ప్రేమలో కృతిసనన్..! ప్రియుడితో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

Did Kriti Sanon just confirm her relationship with Kabir Bahia
Kriti Sanon : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వారు గ్రీస్‌కు విహార యాత్రకు వెళ్లొచ్చినట్లుగా రూమర్లు వచ్చాయి. అయితే.. వీటిపై అమ్మడు ఎప్పుడూ స్పందించలేదు. అయితే.. తాజాగా అమ్మడు చేసిన ఓ పని వారి మధ్య ప్రేమ ఉందనే వచ్చే వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
కబీర్ బహియా పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది కృతి సనన్. అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. “పుట్టిన రోజు శుభాకాంక్షలు కే” అంటూ హార్ట్ ఎమోజీను పోస్ట్ చేసింది. ఇక నీ చిరునవ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలంటూ రాసుకొచ్చింది.
Pushpa 2: పుష్ప 2 టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు.. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ రూ.300?
కృతి సోదరి నూపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ అతడికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో బెన్‌తో పాటు కృతి, కబీర్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Janhvi Kapoor : వామ్మో.. జాన్వీ కపూర్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్