Janhvi Kapoor : వామ్మో.. జాన్వీ కపూర్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో నటించి తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. దీంతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

Wow Does Janhvi Kapoor have this talent too
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో నటించి తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. దీంతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక హిందీలో సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసింది.
Also Read : Sai Dharam Tej : మా ఫామిలీలో ఆ ఇన్సిడెంట్ జరిగింది.. అందుకే ఆ చిన్న పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా..
అయితే ఈ భామ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎల్లప్పుడూ తన హాట్ ఫోటోలని షేర్ చేస్తుంటుంది. తనకి సంబందించిన ప్రతి అప్డేట్ ను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో ఆమె వేసిన పలు పెయింటింగ్స్ ఫోటోలను షేర్ చేసింది. అలాగే ” మా నాన్న నన్ను పెయింటింగ్స్ పట్టుకొని స్టూడెంట్ లాగా ఫోటో దిగమని చెప్పాడు. అలా దిగితే ఆయన ఆ ఫోటోలను తన ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేసుకోవచ్చని.. ఇంకా ఆ పెయింటింగ్స్ కి హైప్ ఇస్తారని”.. అంటూ దానికి ఓ కాప్షన్ జోడించింది.
View this post on Instagram
దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక జాన్వీలో ఉన్న ఈ ట్యాలెంట్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. హీరోయిన్ గానే కాదు. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ భామ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.