Sai Dharam Tej : మా ఫ్యామిలీలో ఆ ఇన్సిడెంట్ జరిగింది.. అందుకే ఆ చిన్న పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకోడానికి మంగళగిరి వచ్చాడు.

Sai Dharam Tej  : మా ఫ్యామిలీలో ఆ ఇన్సిడెంట్ జరిగింది.. అందుకే ఆ చిన్న పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా..

That incident happened in our family Thats why i reacted so much about that little baby Sai Dharam Tej comments goes viral

Updated On : November 19, 2024 / 6:38 PM IST

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకోడానికి మంగళగిరి వచ్చాడు. తన ఆశీర్వాదం తీసుకొని హగ్ చేసుకున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ శాలువాతో తనని సన్మానించి అభినందించాడు. అలాగే తేజ్ కి కొన్ని బహుమతులను కూడా అందించాడు.

ఇక ఈ సందర్బంగా తేజ్ మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు జరిగిన ఓ చిన్నారి ఇన్సిడెంట్ గుర్తుచేసుకున్నారు. గతంలో ఓ చిన్నారి వీడియో పై అసభ్యకరంగా మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు వీడియో పెట్టారు. ఇక వీడియో చూసిన తేజ్ కోపంతో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Also Read : Shobha Shetty : మొన్న తెలుగు బిగ్ బాస్.. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్.. శోభా శెట్టి హవా..

ఈ విషయం గురించి మాట్లాడుతూ..” చైల్డ్ అబ్యూస్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు. ఇలాంటి సంఘటన మా ఫ్యామిలీలో జరిగింది. అలాంటి సమయంలో మేమందరం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. వాటిని మేము ఎదురుకున్నాం. అసలు చిన్న పిల్లల మీద జోక్స్ వెయ్యడమేంటి.. పేరెంట్స్ కి మాత్రమే ఈ బాధ అర్ధమౌతుంది. మా ఫ్యామిలీ లో జరిగింది కాబట్టి నాకు ఆ బాద ఎలా వుంటుందో తెలుసు. అందుకే ఆ పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా అని తెలిపాడు తేజ్. దీంతో తేజ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.