విలన్ పాత్రలో కనిపించనున్న ఐశ్వర్యరాయ్

  • Publish Date - April 6, 2019 / 10:45 AM IST

బాలీవుడ్ లెజెండ‌రీ హీరో అమితాబ్ బ‌చ్చ‌న్, మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ఐశ్వ‌ర్య‌రాయ్ మ‌రోసారి వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. ద‌క్షిణాది ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర్న‌తం తెర‌కెక్కించ‌నున్న భారీ బ‌డ్జెట్ సినిమాలో వీరు న‌టించ‌నున్నారు. నందిని అనే పాత్ర కోసం ఐష్‌ ని మ‌ణిర‌త్నం సంప్ర‌దించాడని, అందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. తాజా స‌మాచారం ప్ర‌కారం ఐష్ ఈ చిత్రంలో విలన్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. దీనిపై త్వర‌లోనే క్లారిటీ రానుంది. 

ఐష్ గ‌తంలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘ఇరువర్‌’, ‘గురు’, ‘రావణ్‌’ చిత్రాల‌లో న‌టించిన సంగతి తెలిసిందే. జ‌యం ర‌వి, విక్రమ్, శింబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో ఉంటుంద‌ని చెబుతున్నారు.
 

ట్రెండింగ్ వార్తలు