Aishwarya Rajanikanth
Aishwarya Rajanikanth : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన ‘3’ మూవీలోని ‘వై దిస్ కొలవెరి’ పాట ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ పాట వల్లే 3 సినిమా ఫ్లాప్ అయ్యిందంటూ ఐశ్వర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
3′ సినిమాలోని వై దిస్ కొలవెరి డి పాట సాహిత్యం, మ్యూజిక్ వల్ల సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించగా..హీరో ధనుష్ సాహిత్యం రాశారు. లవ్‌లో ఫెయిల్ అయిన ఓ అబ్బాయి ఫీలింగ్స్ ఈ పాట. ఇక ఈ పాట మామూలు హిట్ కాలేదు. యూట్యూబ్‌ను షేక్ చేసింది. అయితే ఈ సినిమా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా. ఈ పాట హిట్ ఇచ్చిన హైప్‌తో సినిమాను ఓ రేంజ్ లో ఊహించారు జనాలు. కానీ సినిమా పరాజయం పాలైంది. 30 మార్చి, 2012 లో విడుదలైన ఈ సినిమాలోని ఈ పాట గురించి తాజాగా ఐశ్వర్య కామెంట్స్ చేసారు. ‘లాల్ సలామ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆ పాట వల్లే 3′ సినిమా ఫెయిల్ నట్లు కామెంట్స్ చేశారు.
Sai Pallavi : బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి.. ఆ స్టార్ హీరో కొడుకుతో షూటింగ్ మొదలు..
‘వై దిస్ కొలవెరి’ పాట ప్రభావం 3′ సినిమాపై చూపించిందని ఐశ్వర్య అన్నారు. ఈ సినిమాలోని పాట సందర్భం వేరు.. సినిమా కంటెంట్ వేరని.. సీరియస్‌గా సాగే కంటెంట్‌కి ఈ పాట భిన్నమైన అభిప్రాయాన్ని తీసుకువచ్చిందని ఐశ్వర్య అన్నారు. ఈ పాట విన్నాక డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్ కి వచ్చిన వారికి సినిమా నచ్చలేదని ఐశ్వర్య చెప్పారు. అయితే ఈ పాట అనిరుధ్ కెరియర్‌కి ఎంతో ఉపయోగపడటం తనకి సంతోషం ఇచ్చిందని చెప్పారు. కాగా రీసెంట్‌గా ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9న విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రజనీకాంత్ మొయినుద్దీన్ భాయ్ పాత్రలో నటించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళంలో బాగానే ఆడుతున్న ఈ సినిమాకి తెలుగులో ఆశించిన రెస్పాన్స్ రాలేదు.