Sai Pallavi : బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి.. ఆ స్టార్ హీరో కొడుకుతో షూటింగ్ మొదలు..
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో ఇప్పటికే జపాన్‌లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Sai Pallavi
Sai Pallavi : ‘ప్రేమమ్’ అనే మళయాళ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన సాయి పల్లవి ఆ తరువాత తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జపాన్‌లో వీరి సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
సాయి పల్లవి అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. టోక్యో రోడ్లపై సాయి పల్లవి, జునైద్ షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐకానిక్ స్నో ఫెస్టివల్ సందర్భంలో జపాన్‌లోని సపోరోలో షూట్ జరిగిందట. ఆ షూట్‌కి సబంధించి జునైద్, సాయి పల్లవి ఫోటోలు లీకైనట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ కొడుకుని స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సాయి పల్లవి, జునైద్ కెమెస్ట్రీ స్క్రీన్‌పై ఎలా ఉంటుందా? అని ఆసక్తి కనబరుస్తున్నారు.
సాయి పల్లవి తెలుగులో నాగచైతన్యతో నటిస్తున్న ‘తండేల్’ సినిమా షూటింగ్ పూర్తైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అర్జున్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రామాయణ కధ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ రూపొందిస్తున్న సినిమాలో సీతాదేవిగా సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు.
Sai Pallavi ile Junaid Khan (Evet, Aamir Khan’ın oğlu)’ın Japonya’nın Sapporo şehrinde romantik bir film çektiğine dair haberler vardı. Filmin setinden fotoğraflar sızmış yeni. Şimdi haberlere inanmaya başladım ve heyecanım arttı?#SaiPallavi #JunaidKhan pic.twitter.com/stjjDccjd6
— Dilara (@dilaradray) February 12, 2024