Ajay Devgn : లాంగ్వేజ్ వార్.. సుదీప్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో..

హిందీ జాతీయ భాష కాదు అన్న సుదీప్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు, హిందీ రాష్ట్రాల వాళ్ళు సుదీప్ వ్యాఖ్యలని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.........

Sudeep

Sudeep :  ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమా, సౌత్ సినిమాలు బాలీవుడ్ ని దాటేస్తున్నాయి అనే టాపిక్స్ నడుస్తున్నాయి. ఒకపక్క సౌత్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో దీనిపై సౌత్ సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తుంటే బాలీవుడ్ వాళ్ళు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా వీటిపై కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారు. అందులో ఒక చిన్న కరెక్షన్‌ ఉంది. హిందీ ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదు. మనం పాన్ ఇండియా సినిమాలు తీయడం కాదు బాలీవుడ్‌ వాళ్లే పాన్‌ ఇండియా సినిమాలు అని తీస్తున్నారు. హిందీలో చేసిన సినిమాని తెలుగు, తమిళ్ అన్ని చోట్ల డబ్ చేసి రిలీజ్ చేసి పాన్ ఇండియా సినిమాలంటున్నారు. మనం సినిమాలు తీస్తున్నాం. ఎలాంటి సినిమాలంటే మనం తీసిన సినిమాలు అన్ని చోట్లకి రీచ్ అయి, అన్ని చోట్ల విజయం సాధించే సినిమాలు తీస్తున్నాం. ప్రపంచమంతా మన సినిమాలని చూస్తుంది” అని అన్నారు.

Chiranjeevi : నా సినిమాని బన్నీ రీమేక్ చేస్తేనే బాగుంటుంది.. బన్నీ గురించి సీక్రెట్ చెప్పిన చిరు

 

అయితే హిందీ జాతీయ భాష కాదు అన్న సుదీప్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు, హిందీ రాష్ట్రాల వాళ్ళు సుదీప్ వ్యాఖ్యలని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ స్పందించాడు. సుదీప్ చేసిన వ్యాఖ్యలపై అజయ్ దేవగణ్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. ”బ్రదర్‌ కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జనగణమన” అని పోస్ట్ చేసి సుదీప్ ని ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు లాంగ్వేజ్‌ వార్‌కి తెర తీసినట్టు అవుతుంది. మరి దీనిపై ఇంకెవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.