Music Shop Murthy : ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్ చూశారా? 50 ఏళ్ళ వయసులో డీజే అవ్వాలనుకుంటే..?

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది.

Music Shop Murthy : ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్ చూశారా? 50 ఏళ్ళ వయసులో డీజే అవ్వాలనుకుంటే..?

Ajay Ghosh Chandini Chowdary Music Shop Murthy Teaser Released

Updated On : April 21, 2024 / 7:47 PM IST

Music Shop Murthy Teaser : అజయ్ ఘోష్(Ajay Ghosh), చాందినీ చౌదరి.. ముఖ్య పాత్రల్లో ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఇటీవల ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈవెంట్ కి దర్శకుడు అజయ్ భూపతి గెస్ట్ గా వచ్చారు.

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ళ వ్యక్తి హైదరాబాద్ కి డీజే అవ్వాలని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఈ ప్రయాణంలో 25 ఏళ్ళ అమ్మాయితో ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథాంశంతో ఈ సినిమా సాగనున్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

ఈ ఈవెంట్ కి వచ్చిన అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఇప్పటి జనరేషన్ అమ్మాయి, పాత జనరేషన్ వ్యక్తితో ఇలా రెండు భిన్న తరాల వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. ఈ సినిమాలో ఉండబోతున్నట్టు నేను కూడా అలాంటి వ్యక్తులతోనే స్నేహం చేస్తాను. అందుకే నా RX 100 సినిమాలో డాడీ పాత్ర, మహాసముద్రంలో చుంచు మామ పాత్ర, మంగళవారంలో అజయ్ ఘోష్ పాత్రను రాసుకున్నాను. అజయ్ ఘోష్ గారు కోట శ్రీనివాసరావు గారి స్థాయికి ఎదుగుతారు అని తెలిపారు.

Ajay Ghosh Chandini Chowdary Music Shop Murthy Teaser Released

ఇక అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. కరోనా టైంలో దర్శకుడు శివ వచ్చి నేనే మెయిన్ లీడ్ అని సినిమా నాతోనే తీస్తానని పట్టు బట్టి కూర్చున్నాడు. ఓ రెండేళ్లు తిరిగాడు. కథ కూడా నచ్చి ఒప్పుకున్నాను. ఒక జీవితం ఉంటుంది ఈ కథలో. మలయాళం, మరాఠీ భాషల్లో మంచి సినిమాలు వస్తాయని అంతా అంటారు. అలాంటి సినిమా ఇది అని అన్నారు.