Ajith kumar meets with another car crash
మరోసారి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా – ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అజిత్ నడుపుతున్న కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. డివైడర్‌ను డీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అయితే.. ఈ ప్రమాదం నుంచి హీరో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్‌కు కారు రేసింగ్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పలు కారు రేసింగ్ ఈవెంట్స్‌లో పాల్గొంటుంటారు. ఇప్పటి వరకు రేసింగ్‌లో పలుమార్లు ప్రమాదానికి గురి అయ్యారు.
தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார் 🔥#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up
— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025
ఈ ఏడాది మార్చిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో సైతం ప్రమాదం జరిగింది. మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి ఇతర కార్లే కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan-Samantha : పవన్ తో పోటి పడుతున్న సమంత
ఇక సినిమాల విషయానికి వస్తే.. అజిత్ నటించిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.