Akhanda Mass Jathara : ఆరో వారంలోనూ అన్‌స్టాపబుల్..

విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి ఎంటర్ అయ్యి.. 50 రోజుల వైపు శరవేగంగా పరుగులు తీస్తుంది ‘అఖండ’..

Akhanda Mass Jathara : ఆరో వారంలోనూ అన్‌స్టాపబుల్..

Akhanda 6 Weeks

Updated On : January 14, 2022 / 1:05 PM IST

Akhanda Mass Jathara: క్లాస్, మాస్ అనే తేడా లేకుండా గత నెలన్నరగా బాక్సాఫీస్ బరిలో సోలోగా సందడి చేస్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. బాలయ్య-బోయపాటిల క్రేజీ కాంబినేషన్‌లో, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ ఫిలిం ‘అఖండ’.

Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..

సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన స్టార్ హీరో సినిమా కావడంతో ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా ‘అఖండ’ కు బ్రహ్మరథం పట్టారు. సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు బాలయ్య. బాక్సాఫీస్ బరిలో అసలు సిసలు మాస్ జాతర అంటే ఎలా ఉంటుందో చూపించారు బాలయ్య-బోయపాటి.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి ఎంటర్ అయ్యి 50 రోజుల వైపు శరవేగంగా పరుగులు తీస్తుందీ చిత్రం. మొత్తం ఆరు వారాలకు గాను బాక్సాఫీస్ బరిలో బాలయ్య ‘అఖండ’ గర్జన (కలెక్షన్స్) వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం- రూ.24.70 కోట్లు
సీడెడ్- రూ.17 కోట్లు
ఈస్ట్- రూ.4.26 కోట్లు
వెస్ట్- రూ.4.22 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ.6.75 కోట్లు
కృష్ణా- రూ.3.70 కోట్లు
గుంటూరు- రూ.6.25 కోట్లు
నెల్లూరు- రూ. 2.75 కోట్లు
కర్ణాటక- రూ. 7.10 కోట్లు
తమిళనాడు- రూ. 0.95 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- రూ.1.25 కోట్లు
ఓవర్సీస్- రూ.6.57 కోట్లు
టోటల్ ఆరు వారాల గ్రాస్ – రూ.145+కోట్లు
షేర్- రూ. 85.50 కోట్లు

Arjuna Phalguna : ‘ఆహా’ లో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే..