Akhanda Trailer Roar : ‘అఖండ’ గా బాలయ్య ‘సింహా’ గర్జన..

నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

Akhanda Trailer Roar : ‘అఖండ’ గా బాలయ్య ‘సింహా’ గర్జన..

Nbk

Updated On : November 14, 2021 / 9:07 PM IST

Akhanda Trailer Roar: ఆయన మీసం మెలేసి ఓరకంటితో ఓ చూపు చూస్తే సిల్వర్ స్ర్కీన్ షేకవుతుంది.. పవర్‌ఫుల్‌గా డైలాగ్ చెప్తే థియేటర్లలో డైనమైట్స్ పేలినట్లు ఉంటుంది. మనసు పెట్టి డ్యాన్స్ మూమెంట్స్ వేస్తే ఫ్యాన్స్ తెర ఎక్కి డ్యాన్స్ వేస్తారు. ఆయన కనిపిస్తే చాలు చొక్కాలు చింపుకుంటారు. జయపజయాలు కాదు.. ప్రేక్షకాభిమానులను అలరించడమే ముఖ్యం అంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ.

Akhanda Trailer : అరాచకం.. నటసింహా నట విశ్వరూపం..

‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల్లో బాలయ్యను నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు చూపించి.. ఇలా చూపిస్తే ఎందుకు చూడరంటూ.. బాలయ్య నట విశ్వరూపానికి రెండుసార్లు నంది అవార్డులు పొందేలా చేశారు ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. మరి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా రాబోతుందంటే అంచనాలు ఎలా ఉంటాయి?.. ఆకాశన్నంటుతాయి కదా..

అభిమానుల ఎదురు చూపులు.. ప్రేక్షకుల అంచనాలు నెలకొన్న మాస్ మసాలా మావీ ‘అఖండ’ ట్రైలర్ ఆదివారం రాత్రి 7:09 గంటలకు రిలీజ్ చేశారు టీం. చూసిన వాళ్లంతా సింప్లీ సూపర్బ్.. బాలయ్యను ఇలా చూపించడం బోయపాటికే సాధ్యం.. డైలాగ్స్ అదిరిపోయాయి అంటున్నారు. రిలీజ్ చేసిన అతి తక్కువ టైంలో 2 మిలియన్ వ్యూస్ అండ్ లైక్స్‌తో దూసుకెళ్తూ.. నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది ట్రైలర్. డిసెంబర్ 2న ‘అఖండ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.