Mr. మజ్ను రెచ్చిపోయి రొమాన్స్ చేసాడు

ప్రపంచంలో ఉన్న అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ, వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది, అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పడం చూస్తే, డైరెక్టర్ అఖిల్‌ని, ఏ రేంజ్ ప్లే బాయ్‌గా చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

  • Published By: sekhar ,Published On : January 2, 2019 / 01:02 PM IST
Mr. మజ్ను రెచ్చిపోయి రొమాన్స్ చేసాడు

ప్రపంచంలో ఉన్న అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ, వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది, అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పడం చూస్తే, డైరెక్టర్ అఖిల్‌ని, ఏ రేంజ్ ప్లే బాయ్‌గా చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

అక్కినేని అఖిల్,   నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా, తొలిప్రేమతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా, మిస్టర్ మజ్ను.. ఇంతకుముందు రిలీజ్ చేసిన Mr.మజ్ను టీజర్‌కీ, రెండు పాటలకీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మరో అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. డీన్ ఇంట్లో, మార్గరెట్ రూమ్‌లో, రాత్రి లెవన్ థర్టీ పిఎమ్‌కి ఏం చేస్తున్నావ్? అని ఒకమ్మాయి మజ్నుని క్వశ్చన్ చెయ్యడంతో టీజర్ స్టార్ట్ అయ్యింది. అమ్మాయి ప్రశ్నకి, మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీలయినప్పుడు, మీరేం చేసేవారు? అంటూ మరో ప్రశ్నవేసాడు మిస్టర్ మజ్ను.

అమ్మాయి, చాక్లెట్ తినేదాన్ని అని ఆన్సర్ ఇస్తే, ఆ రోజుల్లో చాక్లెట్లతో పనైపోయేది. కానీ, టు డేస్ స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి అని చెప్పిన మజ్ను, అమ్మాయిలకు కన్ను కొట్టడం, రెచ్చిపోయి రొమాన్స్ చెయ్యడం, హీరోయిన్‌ని ఫాలో అవుతూ ఫోటోలు తియ్యడం, పాటలు పాడుతూ స్టెప్పులెయ్యడం, ఫైట్స్ చెయ్యడం, హీరోయిన్ మనోడిది డేంజరస్ క్యారెక్టర్ అని ఫిక్స్ అవడం..

అలా సాగిపోయిన టీజర్ చివర్లో, హీరోయిన్‌తో, ప్రపంచంలో ఉన్న అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ, వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది, అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పడం చూస్తే, డైరెక్టర్ అఖిల్‌ని, ఏ రేంజ్ ప్లే బాయ్‌గా చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ సినిమాతోనే, యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్‌కి మంచి పేరు తెచ్చుకున్న అఖిల్, ఈ సినిమాలోనూ లుక్స్ పరంగా, యాక్టింగ్ వైజ్ కూడా ఇంప్రూవ్ అయినట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది.

నాన్న నాగార్జున, అన్నయ్య నాగ చైతన్యల తర్వాత, మిస్టర్ మజ్నుతో అఖిల్ లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకుంటాడని అక్కినేని అభిమానులు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు. టీజర్‌లో థమన్ మ్యూజిక్, జార్జ్ సి.విలియమ్స్ ఫోటోగ్రఫీ బాగున్నాయి. నాగబాబు, ప్రియదర్శి, జయ ప్రకాష్ తదితరులు నటిస్తున్న Mr.మజ్ను జనవరి 25న రిలీజ్ కానుంది.

 

వాచ్ టీజర్…