Mr. మజ్ను ఫస్ట్ టాక్

యూఎస్ ఆడియన్స్ నుండి మిస్టర్ మజ్ను మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

  • Published By: sekhar ,Published On : January 25, 2019 / 05:16 AM IST
Mr. మజ్ను ఫస్ట్ టాక్

Updated On : January 25, 2019 / 5:16 AM IST

యూఎస్ ఆడియన్స్ నుండి మిస్టర్ మజ్ను మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అక్కినేని అఖిల్,  నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్స్‌గా, తొలిప్రేమ సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన సినిమా, మిస్టర్ మజ్ను.. ఈ సినిమా టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ గత సినిమాలు నిరాశ పరిచిన నేపథ్యంలో, యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఖచ్చితంగా హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది.

ఇక్కడ జనవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా, నిన్న రాత్రి ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. యూఎస్ ఆడియన్స్ నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్‌ హాఫ్ లవ్ స్టోరీ చాలా బాగుందని, సెకండ్‌ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్ బాగుందని, ఇంతకుముందు రెండు సినిమాలతో కంపేర్ చేస్తే, అఖిల్ ఈ మూవీలో అన్ని రకాలుగా మెప్పించాడని, ఓవరాల్‌గా మిస్టర్ మజ్ను హిట్ మూవీ అని చెప్తున్నారు. మరి కాసేపట్లో మన టాలీవుడ్ రివ్యూ రానుంది.

వాచ్ టీజర్…