తారక్ నుంచి అఖిల్ ఆ రెండూ నేర్చుకోవాలి

హైదరాబాద్: ఏ నటుడికైనా ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరం. అఖిల్ అలా తనని తాను విమర్శించుకోగలడు. అదే తనని ఓ గొప్ప నటుడిగా మారుస్తుంది’’ ప్రముఖ యువకధానాయకుడు ఎన్టీఆర్. హైదరాబాద్ లో శనివారం జరిగిన ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ లో ఆయన అతిధిగా పాల్గోన్నారు. నటుడిగా దర్శకుడిగా, రచయితగా వెంకీ నాకు పరిచయం ఉందని, వెంకీ తొలి చిత్రం తొలిప్రేమ బాగా తీశాడని అన్నారు ఎన్టీఆర్. ఓ కమర్షియల్ సినిమా తీయడం కన్నా,కథను నమ్ముకుని సినిమా తీయడం చాలా కష్టమైన పని. మొదటి చిత్రంతోనే అది సాధించాడు వెంకీ. రాసిపెట్టుకోండి.. అఖిల్ ఏదో ఓ రోజు టాలీవుడ్‌లో మంచి నటుడిగా నిలిచిపోతాడని, అదెంతో దూరంలో లేద’’ని ఎన్టీఆర్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా , అఖిల్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు.
‘‘నటన, మాస్.. ఈ రెండూ తారక్ నుంచి అఖిల్ నేర్చుకోవాలి. తారక్ ని నేనుటైగర్ అని పిలుస్తాను. నిజంగా అతను పులే . ఆయన ఉత్సాహాన్ని ఎవరూ అందుకోలేరని నాగార్జున అన్నారు. మజ్నూ టైటిల్ నాన్నగారిది, తర్వాత నా దగ్గరకు వచ్చింది, ఆ రెండు ఎంతవిజయాన్నిసాధించాయో ఈసినిమా కూడా అంతే విజయాన్ని సాధించాలని నాగార్జున అన్నారు.
నాగచైతన్య “శివ” సినిమా చూసి చాలా స్పూర్తి పొందానని, “ప్రేమ్ నగర్” లో కధానాయకుడి పాత్రనుంచి ప్రేరణ పొంది “మిస్టర్ మజ్ను” కధ రాసుకున్నాని దర్శకుడు వెంకీ తెలిపారు. చిత్రంలోని ప్రతిఒక్కరూ చేసిన కృషి వల్ల ఆరు పాటలు బాగా వచ్చాయని సంగీత దర్శకుడు తమన్ అన్నారు.