Akhil Akkineni: మా ఆవిడ సంగతి మీకు తెలీదు.. భార్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్..
అఖిల్ భార్య జైనబ్ రవ్జీ కూడా లెనిన్ సక్సెస్ ఈవెంట్ కి రావడంతో బాగా వైరల్ అయ్యారు.(Akhil Akkineni)
Akkineni Akhil Comments On His Wife Zainab Ravdjee
Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇటీవల లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కి అఖిల్ తో పాటు అఖిల్ భార్య జైనబ్ రవ్జీ (Zainab Ravdjee) కూడా హాజరయి ఒక్కసారిగా వైరల్ అయింది. 2025 జూన్ లో అఖిల్ జైనబ్ రవ్జీ వివాహం జరిగింది. అప్పట్నుంచి ఈ జంట మీడియా ముందుకు రాలేదు. అఖిల్ భార్య జైనబ్ రవ్జీ కూడా లెనిన్ సక్సెస్ ఈవెంట్ కి రావడంతో బాగా వైరల్ అయ్యారు.
ఇక అఖిల్ ఇప్పటికే ఇంటర్వ్యూలలో, సక్సెస్ మీట్ స్టేజిపై తన భార్య చాలా సపోర్ట్ ఇచ్చిందని, తనని బంగారు తల్లి అని పిలిస్తాను అంటూ భార్య గురించి మాట్లాడాడు. తాజాగా ఓ టీవీ షోకి హాజరయ్యారు అఖిల్. ఈ షోలో తన భార్య లెనిన్ సినిమాకు వెళ్లి విజిల్స్ వేస్తూ సందడి చేసిన వీడియోని ప్లే చేసారు.
Also Read: వుడెన్ హౌస్ బార్లో.. స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతున్న అవికా గోర్..
దీంతో అఖిల్ తన భార్య జైనబ్ రవ్జీ గురించి మాట్లాడుతూ.. మా ఆవిడ సంగతి మీకు తెలీదు. మా ఆవిడ చాలా మాస్. కెమెరాలు ఉన్నాయి కాబట్టి చాలా సైలెంట్ గా ఉంది. లేదా ఇంకా అరిచేది. తను నా లక్కీ చామ్. తను వచ్చాక అన్ని మారాయి. బంగారుతల్లి ఐ లవ్ యు అని తెలిపారు.
