Lenin Collections : ‘లెనిన్’ సినిమాకు ఎన్ని కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి? వంద కోట్ల పోస్టర్ వేస్తారా?
నేడు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పటివరకు 87 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటించింది. (Lenin Collections)
Lenin Collections
Lenin Collections : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కిన సినిమా ‘లెనిన్’ ఇటీవల జులై 10న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. మొదటిసారి అఖిల్ ఫుల్ పాజిటివ్ టాక్ తో హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజే ఈ సినిమా దాదాపు 16 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా నేడు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పటివరకు 88 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో త్వరలో ఈ సినిమాకు కూడా వంద కోట్ల పోస్టర్ వేస్తారని తెలుస్తుంది. ఇటీవల సినిమా కలెక్షన్స్ వచ్చినదానికంటే ఎక్కువే చెప్తున్నారని తెలిసిందే. నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ స్వయంగా మేము అనౌన్స్ చేసే కలెక్షన్స్ పోస్టర్స్ అన్ని ఫేక్ అని చెప్పుకొచ్చారు.
Also Read : Kiran Abbavaram : నేను పవన్ కళ్యాణ్ అభిమానినే.. కానీ.. ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..
లెనిన్ సినిమాకు కూడా ఇలాగే ఓ 20 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ చూపించి వేస్తున్నారు అని తెలుస్తుంది. ఇటీవల లెనిన్ సక్సెస్ మీట్ లో నాగవంశీ అఖిల్ కి వంద కోట్ల సినిమా ఇవ్వాలి అంటూ కామెంట్స్ చేసారు. ఈ వారం జననాయగాన్, చెన్నై లవ్ స్టోరీ.. లాంటి బజ్ ఉన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొదట్లో వచ్చిన రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టం. కానీ త్వరలోనే వంద కోట్ల పోస్టర్ మాత్రం వేస్తారని తెలుస్తుంది.
అయితే లెనిన్ సినిమాకు మూవీ యూనిట్ చెప్పినన్ని కలెక్షన్స్ రాకపోయినా హిట్ అయింది, ప్రాఫిట్స్ వచ్చాయి. లెనిన్ సినిమాకు ఇప్పటివరకు దాదాపు 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కేవలం 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయింది. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇప్పటికే 65 కోట్లకు పైగా వచ్చాయి కాబట్టి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందని, దాదాపు 15 కోట్లు ప్రాఫిట్ లో ఉంది ఈ సినిమా అని సమాచారం.
Also Read : Salman Khan : ఈ పోస్ట్ తో తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినట్టేనా..? సల్మాన్ ఖాన్ పోస్ట్ వైరల్..
ఇక లెనిన్ సినిమాకు రిలీజ్ ముందే నాన్ థియేటరికల్ రైట్స్ కూడా అమ్ముడుపోవడం విశేషం. జీ5 ఓటీటీ ఈ సినిమాను 19 కోట్లకు డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి కొనుక్కుందని, హిందీ వర్షన్ సపరేట్ గా మరో 9 కోట్లకు అమ్మారని, ఆడియో రూపంలో దాదాపు 6 కోట్లు వచ్చాయని సమాచారం. అలా నాన్ థియేట్రికల్ బిజినెస్ లోనే దాదాపు 34 కోట్లు వసూలు చేసింది అఖిల్ లెనిన్ సినిమా. ఇక ఈ సినిమాని దాదాపు 70 కోట్లు ఖర్చుపెట్టి తీశారు. మొత్తానికి అయ్యగారు లెనిన్ సినిమాతో హిట్ కొట్టేసారు.
