Kiran Abbavaram : నేను పవన్ కళ్యాణ్ అభిమానినే.. కానీ.. ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..
గతంలో కిరణ్ అబ్బవరం అవసరాన్ని బట్టి అభిమాన హీరో మారుస్తాడని సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కున్నాడు. (Kiran Abbavaram)
Kiran Abbavaram
Kiran Abbavaram : వరుస సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం. హీరోగా ఇటీవల రెండు సినిమాలు హిట్ కొట్టాడు. నిర్మాతగా కూడా హిట్ కొట్టాడు. త్వరలో దర్శకుడిగా కూడా రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ జులై 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కిరణ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
గతంలో కిరణ్ అబ్బవరం అవసరాన్ని బట్టి అభిమాన హీరో మారుస్తాడని సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కున్నాడు. కిరణ్ వేర్వేరు హీరోలను పలు సందర్భాలలో పొగుడుతున్న వీడియోలను షేర్ చేసి ఈ కామెంట్స్ తో ట్రోల్ చేసారు. తాజాగా వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.
Also Read : Salman Khan : ఈ పోస్ట్ తో తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినట్టేనా..? సల్మాన్ ఖాన్ పోస్ట్ వైరల్..
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఫేవరెట్ హీరోల్ని మార్చలేదు. మార్చను కూడా. సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ కు ఫ్యానిజం చేశాను. నేను ఫ్యానిజం చేసిన ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్. కాలేజ్ డేస్ లో, జాబ్ చేసే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడు చాలా చేసాము. కానీ నేను సినిమా లవర్ ని కాబట్టి అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాను. ఆది సినిమా చూసి చొక్కాలు చింపుకున్నాను, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు నా ఫేవరెట్ సినిమాలు. చిరంజీవి, చరణ్ సినిమాలకు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాను. నేను అందరి హీరోల సినిమాలను ఎంజాయ్ చేస్తాను కానీ ఫేవరెట్ హీరో మాత్రం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరో కష్టాలేంటో అర్థమయ్యాయి అందుకే నేను అందరి హీరోలను గౌరవిస్తాను. సోషల్ మీడియాలో నాపై కొన్ని వీడియోలు పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేసారు ఈ విషయంలో అని అన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా అని అడగ్గా కిరణ్ అబ్బవరం.. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. అలా అని ఆయన సినిమాలో ఓ చిన్న రోల్ ఇస్తే అది నచ్చకుండా నేను చేయను. పవన్ కళ్యాణ్ సినిమా కదా అని నేను నాకు నచ్చని పాత్ర చేయను. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చి అది చిన్న పాత్ర అయినా సరే నాకు నచ్చితే ఆనందంతో చేస్తాను అని అన్నారు.
Also Read : Akkineni Heros : ఒకే వేదికపైకి ముగ్గురు అక్కినేని హీరోలు.. లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం.. కానీ..
