కొడుకుతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున

తాను వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యానని నాగార్జున మీడియాకు తెలిపారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు.

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు ఇవాళ నాగార్జున, అతడి కుమారుడు నాగ చైతన్య హాజరయ్యారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఎదుట నాగార్జున, చైతన్య స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. 14 వీడియోస్, పేపర్ క్లిప్పింగ్స్ ను కోర్టుకు సమర్పించారు నాగార్జున. (Akkineni Nagarjuna)

Also Read: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా

నాగార్జున సమర్పించిన ఆధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నాగార్జున క్రాస్ ఎగ్జామినేషన్ కు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24 వాయిదా వేసింది. తాను వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యానని నాగార్జున మీడియాకు తెలిపారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు.