హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
మధ్యాహ్నం 1.10 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.

Amit Shah
Amit Shah Hyderabad visit: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్ షా షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
- మధ్యాహ్నం 1.10 గంటలకు- బేగం పేట ఎయిర్ పోర్ట్‌కు
- 6న మధ్యాహ్నం 1.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు – ఐటీసీ కాకతీయలో లంచ్
- మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు – ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో సమావేశం
- మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు – భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 46 ఏండ్లు పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం
- ఐటీసీ కాకతీయలోనే.. ఎస్ఎస్‌బీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన
- సాయంత్రం 4.10 నుంచి 4.55 వరకు – మొజంజాహీ మార్కెట్ లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు
- సాయంత్రం 5.05 గంటలకు – బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుపయనం
Also Read: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?: చంద్రబాబు
మరోవైపు, గణేశ్ నిమజ్జనం సందర్భంగా శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు ఇస్తున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. వచ్చేనెల రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.