Nagarjuna
Nagarjuna : టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికి యంగ్ గా కనిపిస్తూ, పర్ఫెక్ట్ బాడీ, అందం, హెల్త్ మెయింటైన్ చేసేది ఎవరు అంటే నాగార్జున పేరే చెప్తారు అంతా. 66 ఏళ్ళు వచ్చినా ఇంకా మన్మధుడిలా కనిపిస్తారు నాగ్. నాగార్జున ఫిట్నెస్, హెల్త్, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. నాగార్జున ఫిట్నెస్, ఆయన అందంపై వేరే హీరోలు కూడా పొగుడుతారు.(Nagarjuna)
అయితే నాగార్జున కూడా ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారట. తాజాగా హెల్త్ కి సంబంధించిన ఓ ఈవెంట్ కి నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడగా తనకున్న సమస్య గురించి తెలిపారు.
Also Read : Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..
నాగార్జున మాట్లాడుతూ.. 15 ఏళ్ళ క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పట్నుంచి మోకాలి నొప్పితో బాధపడ్డాను. నేను మోకాలు రీప్లేస్మెంట్ చేయించలేదు. సర్జరీని అవాయిడ్ చేశాను. మోకాలు బెటర్ అవ్వడానికి ల్యూబ్రికెంట్ ఫ్ల్యూయిడ్స్ వాడాను, PRP చేసారు, మోకాలు లోపల రీ జనరేట్ అవ్వడానికి డాక్టర్స్ హెల్ప్ చేసారు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా నేను గ్యాప్ ఇవ్వకుండా ప్రతి రోజు ఉదయం మోకాలి కోసం రిహాబ్ చేశాను. దాని మీద వర్క్ చేశాను. ఎప్పట్నుంచో ఈ మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు సర్జరీ వద్దు. సర్జరీ అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తాను అని తెలిపారు.