మనీషా ఘటనకు న్యాయం జరగాలని గొంతెత్తిన Akshay Kumar, Anushka Sharma, Kareena Kapoorలు

మనీషా ఘటనకు న్యాయం జరగాలని గొంతెత్తిన Akshay Kumar, Anushka Sharma, Kareena Kapoorలు

Updated On : October 1, 2020 / 11:15 AM IST

Hathrasలో జరిగిన మనీషా ఘటనపై యావత్ దేశమంతా న్యాయం జరగాలని కోరుతుంది. ఇందులో భాగంగా సినీ తారలు సైతం తమ గొంతు వినిపిస్తున్నారు. ఈ దారుణానికి తగ్గ న్యాయం చేయాలంటూ Akshay Kumar, Anushka Sharma, Kareena Kapoorలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్లో… ‘కోపంగానూ.. అసహనంగానూ ఉంది. హత్రాస్ గ్యాంగ్ రేప్ అతి దారుణమైన ఘటన. ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి. మన చట్టాలతో తీసుకునే యాక్షన్ కు రేపిస్టులు అందరికీ భయం పుట్టాలి. ఆ వెదవల్ని ఉరితీయాలి. మన కూతుళ్లని, సిస్టర్లని కాపాడుకోవాలంటే గొంతెత్తాలి’ అని అక్షయ్ ట్వీట్ చేయగా.. అనుష్క శర్మ, కరీనా కపూర్, కంగనా రనౌట్, హుమా ఖురేషీ ఇతరులంతా అదే మాటపై నిల్చున్నారు.