Akshay Kumar : ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా పోస్ట్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు

Akshay Kumar
Twinkle Khanna Tweet : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. ఇటీవలే అక్షయ్ కు కరోనా వైరస్ సోకడంతో ఆయన ముంబై హిరానందాని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. 2021, ఏప్రిల్ 12వ తేదీన ఇంటికి వచ్చాడని, అంతా బాగానే ఉందని సతీమణి ట్వింకిల్ ఖన్నా ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. చిన్న క్యాప్షన్ తో పాటు ఓ కార్టున్ ను అందులో పోస్టు చేశారు.
భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సినీ ప్రముఖులు కూడా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కూడా వైరస్ బారిన పడడంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముంబైలోని హిరానందాని ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలియచేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, కేవలం వైద్యుల సూచన మేరకే ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం అక్షయ్ న్యూ ఫిల్మ్ రామ్ సేతు చిత్రం షూటింగ్ దశలో ఉంది. కరోనా బారిన పడడంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఆయన ఇంటికి చేరుకోవడంతో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
View this post on Instagram
— Akshay Kumar (@akshaykumar) April 5, 2021