Kannappa : ‘కన్నప్ప’ నుంచి శివుడి ఫస్ట్ లుక్ రిలీజ్.. శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో..

తాజాగా నేడు ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Akshay Kumar Lord Shiva First Look Poster Released from Manchu Vishnu Kannappa Movie

Kannappa : మంచు విష్ణు భారీగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పలువురు పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేసారు. కన్నప్ప టీజర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా నేడు ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు అని రాశారు.

కన్నప్ప సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తుండగా పార్వతి దేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కొన్ని రోజుల క్రితం కాజల్ పార్వతి దేవి లుక్ రిలీజ్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ అక్షయ్ కుమార్ ని ఈ పాత్రకు ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు అని తెలిపాడు. విష్ణు మాట్లాడుతూ.. సినిమాలో శివుడి పాత్ర కోసం మొదట ఓ తమిళ హీరో అనుకున్నాము కానీ అవ్వలేదు. తర్వాత అక్షయ్ కుమార్ గారిని ట్రై చేసాము. ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ మేనేజర్లే ఇలాంటి గెస్ట్ పాత్రలు చేయడు అని చెప్పేవారు. కానీ డైరెక్టర్ సుధా కొంగర ఆయనతో సినిమా చేస్తుండటంతో మా నాన్న సుధాతో మాట్లాడి అక్షయ్ కుమార్ కి ఈ సినిమా గురించి చెప్పించారు. నేను న్యూజిలాండ్ లో షూట్ లో ఉన్నప్పుడు అక్షయ్ ఓకే చెప్పారని తెలిసిందే. దాంతో ఆయనకు కాల్ చేసి కథ ఫోన్ లోనే చెప్పి చెప్పి శివుడి పాత్ర గురించి చెప్పాక ఆయన కూడా శివుడి భక్తుడని ఒప్పుకున్నారు అని తెలిపాడు.

Also Read : Razakar : ‘రజాకార్’ సినిమా ఆహా ఓటీటీలో ఎప్పట్నించి అంటే.. నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది?

ఇక ఈ సినిమాని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా ఆల్మోస్ట్ 90 శాతం షూటింగ్ న్యూజిలాండ్ లోనే చేయగా మిగిలింది రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి చేసారు.