జనవరి 12న అల… వైకుంఠపురములో…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. 'అల... వైకుంఠపురములో'... సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల..

  • Published By: sekhar ,Published On : September 23, 2019 / 05:55 AM IST
జనవరి 12న అల… వైకుంఠపురములో…

Updated On : September 23, 2019 / 5:55 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల… వైకుంఠపురములో’… సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల..

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల… వైకుంఠపురములో’… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. డీజే తర్వాత బన్నీతో, అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి రెండోసారి పనిచేస్తుంది పూజా హెగ్డే.

ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టబు, నివేధా పేతురాజ్, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు నిర్మాతలు..

Read Also : విఠల్‌వాడి – ఫస్ట్ లుక్..

సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల… వైకుంఠపురములో’… చిత్రాన్ని భారీగా విడుదల చెయ్యనున్నారు. కెమెరా : పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.